Urvashi Rautela : ముంబై – ప్రముఖ నటి ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) సంచలనంగా మారారు. తను బాలయ్యతో నటించిన డాకు మహారాజ్ మూవీ బిగ్ సక్సెస్ కావడంతో తెగ సంతోషానికి లోనవుతోంది. ఈ తరుణంలో ఉన్నట్టుండి తన ప్రవర్తనతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Urvashi Rautela Apologies to..
ఇదే సమయంలో ఓ ఛానల్ తో జరిగిన చిట్ చాట్ సందర్బంగా నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగందని, దీనిపై మీ అభిప్రాయం ఏమిటంటూ అడిగన సమయంలో తన చేతికి ఉన్న వజ్రాన్ని పదే పదే చూపించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో ఈ ముద్దుగుమ్మ దిగి వచ్చింది. తాను కావాలని అలా చేయలేదని, తనకు సైఫ్ అలీ ఖాన్ అంటే గౌరవం ఉందని పేర్కొంది. తాను ఎవరి పట్ల అహంభావ పూరితంగా ప్రవర్తించనని, అలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని చెప్పుకొచ్చింది.
ఊర్వశి రౌటేలాకు పొగరు నెత్తికి ఎక్కిందంటూ సైఫ్ అలీ ఖాన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీనిపై సీరియస్ గా స్పందించారు ఊర్వశి రౌటేలా. దయచేసి తనను అపార్థం చేసుకోవద్దని, అలా కావాలని చేసింది కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు తనను క్షమించాలని కోరుకుంటూ కీలక ప్రకటన చేసింది నటి.
Also Read : Hero Jr NTR – Sr NTR : మహోన్నత మానవుడు ఎన్టీఆర్