Urmila Matondkar: ‘యాయి రే యాయి రే’ అంటూ నైంటీస్ లో కుర్రాళ్లను ఉర్రూతలూగించిన బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ మటోండ్కర్ . శేఖర్ కపూర్ మాసూమ్ సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ కి చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన ఊర్మిళ(Urmila Matondkar)… రాంగోపాల్ వర్మ చిత్రాలైన రంగీలా, సత్య, కోన్ చిత్రాలతో తిరుగులేని తారగా ఎదిగారు. రంగీలా సినిమాలోని ‘యాయి రే యాయి రే’ పాటతో యావత్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసారు. ఆ తరువాత ‘జుదాయి, మస్త్, ఖూబ్‌సూరత్, ప్యార్ తునే క్యా కియా భూత్ మరియు ఏక్ హసీనా థీ’ మొదలగు చిత్రాలలో కనిపించారు. చివరగా ఆమె 2014లో అజూబా అనే మరాఠి సినిమాలో నటించగా, 2018లో వచ్చిన బ్లాక్ మెయిల్ మూవీలోని ఓ పాటలో కనిపించారు.
Urmila Matondkar Divorce..
బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో తన కంటే పదేళ్ళు చిన్న వాడైన బిజినెస్ మ్యాన్ మోసిన్ అఖ్తర్ మీర్ ను ప్రేమించి పెళ్ళాడింది. వయసులో తనకంటే పదేళ్ళు చిన్నవాడైనా… ఇద్దరి పర్సనల్ వాల్యూస్, ఇంట్రెస్ట్స్ కలవడంతో 4 ఫిబ్రవరి, 2016లో ఊర్మిళ తన నివాసంలోనే దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో మోసిన్ ను పెళ్లాడింది. ఎనిమిదేళ్లపాటు సాఫీగా సాగిన వీరి వివాహ బంధం… తాజాగా విడాకుల బాటలో నడుస్తోంది. ఇటీవలే ఈ జంట మ్యూచువల్ డైవర్స్ కి అప్లై చేసినట్లు సమాచారం. అయితే ఈ విడాకులకు అసలు కారణాలేంటనేది తెలియాల్సి ఉంది.
పలు నేషనల్ మీడియా ఛానెల్స్ ఈ వార్తను ప్రచారం చేయడంతో ఇప్పుడు సర్వత్రా ఈ చర్చ నెలకొంది. దీనితో ఒకప్పుడు కుర్రాళ్లను ఉర్రూతలూగించిన ఊర్మిళ మటోండ్కర్(Urmila Matondkar)… ఇటీవల వార్తల్లో తెగ హైలెట్ అవుతోంది. ఈ మధ్య సెలబ్రిటీలు చాలా మంది విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడా లిస్ట్ లోకి ఊర్మిళ కూడా చేరింది. మరో వైపు ఆమె భర్త మోసిన్ అఖ్తర్ ‘ఇట్స్ ఎ మ్యాన్స్ వరల్డ్, లక్ బై ఛాన్స్, ముంబై మస్త్ కల్లాందర్ మరియు బి.ఎ. పాస్’ వంటి ప్రాజెక్ట్స్‌లో కనిపించారు.
Also Read : Sa Re Ga Ma Pa: సరిగమప తెలుగు సీజన్ 16 కు ముహూర్తం ఫిక్స్ !