Thalaiva Coolie Sensational :త‌లైవా కూలీలో క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర

నిజ‌మేనంటూ ప్ర‌క‌టించిన న‌టుడు

Coolie : త‌మిళ సినీ సూప‌ర్ స్టార్ త‌లైవా ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న చిత్రం కూలీ. షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. దాదాపు పూర్తి కావ‌చ్చింద‌ని, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ మిగిలి ఉంద‌ని స‌మాచారం. ప్ర‌ముఖ న‌టులు ఇందులో పాలు పంచుకున్నారు. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు లోకేష్ క‌న‌గ‌రాజ్. త‌న మేకింగ్ డిఫ‌రెంట్ గా ఉంటుంది. కూలీ(Coolie)పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మార్కెట్ సైతం ఊహించ‌ని రేంజ్ లో ఉండ‌డం ఖాయ‌మ‌ని పేర్కొంటున్నారు సినీ విమ‌ర్శ‌కులు.

Thalaiva Coolie Movie- Kannada Star In..

కూలీ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున‌, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో పాటు క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర‌రావు కూడా న‌టించ‌నున్నారు. ఈ విషయాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు..ధ్రువీక‌రించారు. త‌లైవాతో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశాడు. ఉపేంద్ర సినీ కెరీర్ లో ఇది 45వ చిత్రం . ఇదిలా ఉండ‌గా గ‌తంలోనే చిత్ర నిర్మాత‌లు నాగ్, ఉపేంద్ర‌ల ఎంట్రీ గురించి ప్ర‌క‌టించారు కూడా.

ర‌జ‌నీకాంత్ , ఉపేంద్ర రావు క‌లిసి జైపూర్ లో జ‌రిగిన షూటింగ్ లో పాలు పంచుకున్నారు. ఈ ఇద్ద‌రిపై కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన‌ట్లు తెలిసింది. ఈ సంద‌ర్బంగా ఉపేంద్ర‌ను అడుగ‌గా ఆయ‌న ఆస‌క్తిక‌రంగా స‌మాధానం ఇచ్చారు. మూవీకి సంబంధించి వివ‌రాలు వెల్ల‌డించ‌లేన‌ని, తాను గ‌తంలో ర‌జ‌నీకాంత్ తో న‌టించిన అనుభ‌వం ఉంద‌న్నారు. కూలీ చిత్రం యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రానుంది. ఇందులో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌ను ఉపేంద్ర పోషించ‌నున్నారు.

Also Read : Hero Kichcha Sudeep New Movie :కిచ్చా సుదీప్ అడ్వెంచ‌ర్ మూవీ అనౌన్స్

CinemaCoolierajinikanthThalaivaaTrendingUpdatesUpendra
Comments (0)
Add Comment