SSRMB Movie : మహేష్, రాజమౌళి సినిమాపై మరో అప్డేట్

కథ తయారు చేయడానికి తనకు రెండేళ్లు పట్టిందని కూడా ఆయన తెలిపారు...

SSRMB : మహేశ్‌బాబు హీరోగా ఎస్‌.ఎ్‌స.రాజమౌళి రూపొందించే భారీ చిత్రం వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతుందని ఆ చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్‌ వెల్లడించారు. కథ తయారు చేయడానికి తనకు రెండేళ్లు పట్టిందని కూడా ఆయన తెలిపారు. దుర్గా ఆర్ట్స్‌ బేనర్‌పై డాక్టర్‌ కె.ఎల్‌.నారాయణ నిర్మించే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్‌ కథ కావడంతో ఈ సినిమాను రెండు భాగాలుగా అందించాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారని అంటున్నారు. ఎంతో స్పాన్‌ ఉన్న కథను రెండు, మూడు గంటల్లో చెప్పడం కుదరదు కనుక రెండు భాగాలుగా తీస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తోంది. ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

SSRMB Movie Updates

అలాగే గ్లోబల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా రూపొందించాలనే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారనీ, అందుకే వివిధ భాషల్లోని స్టార్స్‌తో పాటు కొంతమంది విదేశీ నటులను కూడా తీసుకుంటున్నారనీ చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నా, రాజమౌళి, ఆయన టీమ్‌ స్పందించకుండా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో బిజీగా ఉంది. పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఈ ఊహాగానాలు ఆగవేమో!

Also Read : Salman Khan : సల్మాన్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరో వార్నింగ్ మెసేజ్

CinemaMahesh BabuRajamouliTrendingUpdatesViral
Comments (0)
Add Comment