SDT18 : మెగా హీరో సాయి ధరమ్ తేజ్, బ్లాక్‌బస్టర్ ‘విరూపాక్ష’ చిత్రంతో భారీ విజయాన్ని సాధించిన తర్వాత, ఇప్పుడు తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన SDT 18 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘హనుమాన్’ సెన్సేషనల్ పాన్-ఇండియా విజయం తర్వాత, నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు.
SDT18 Movie Updates
తాజాగా, ఈ సినిమా నుంచి అదిరిపోయే ఒక అప్డేట్ బయటకొచ్చింది. ఇప్పటికే, జగపతి బాబు మరియు సాయి కుమార్ లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు పోస్టర్లు విడుదల చేసి, మూవీ టీమ్ మంచి అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా, సినిమా యొక్క కీలక పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో సాయి ధరమ్ తేజ్(Sai Durgha Tej) చేతిలో రక్తంతో తడిసిన ఖడ్గం కనిపిస్తుంది. మరింత ఉత్కంఠ పెంచుతూ, “డిసెంబర్ 12న Carnage (మారణహోమం) స్టార్ట్” అనే కీలక అప్డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.
SDT18లో సాయి ధరమ్ తేజ్ తన కెరీర్లో ఎప్పుడూ చేయని పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ హై-ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామాలో ఆయ్ష్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతి బాబు మరో కీలక పాత్రలో ఉంటారు. సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్ అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారు. SDT18 పై భారీ అంచనాలు ఉన్నాయి, మరియు ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్‌కు ఒక ఆగిపోని మైలురాయిగా నిలిచిపోతుంది అని భావించబడుతుంది.
Also Read : Dil Raju : ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు పెద్దపీట వేసిన తెలంగాణ సర్కార్