Spirit Movie : ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ సినిమా నుంచి కీలక అప్డేట్

ప్రస్తుతంతాము స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నామని....

Spirit : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా రాజాసాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు డార్లింగ్. డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ వింటేజ్ ప్రభాస్ కనిపించనున్నాడు. దీంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. వీరిద్దరి కాంబోలో వచ్చే మూవీకి స్పిరిట్(Spirit) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. పోలీస్ డ్రామాగా రానున్న ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ ఇటీవలే స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాట్లు తెలుస్తోంది. తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ భూల్ భూలయ్యా 3 ప్రమోషన్లలో ఇంటర్వ్యూలో స్పిరిట్(Spirit) షూటింగ్ గురించి మాట్లాడారు.

Spirit Movie Updates

ప్రస్తుతంతాము స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నామని.. అందులోని నటీనటుల ఎంపిక ఇంకా ఖారారు కాలేదని.. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని.. దానీ త్రవాత షూటింగ్ పనులు స్టార్ట్ చేస్తామని అన్నారు. డిసెంబర్ చివరిలో చిత్రీకరణ మొదలుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని.. ఆ తర్వాత ఆరు నెలల గ్యాప్ ఉంటుందని.. వెంటనే సందీప్ వంగా యానిమల్ పార్క్ స్టార్ట్ చేయనున్నారని అన్నారు. దీంతో త్వరలోనే వరుసగా స్పిరిట్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ పనులు దీపావళి సందర్భంగా స్టార్ట్ అయ్యాయని ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

స్పిరిట్చిత్రానికి దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. హర్షవర్దన్ సందీప్ ట్యూన్స్ ఎంజాయ్ చేస్తూ కనిపించిన ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. స్పిరిట్ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు తొలి రోజే రూ. 150 కోట్ల వసూళ్లు రావడం ఖాయమని గతంలోనే సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ప్రభాస్ విభిన్నమైన లుక్ లో కనిపిస్తారని అన్నారు. ఆయన గత 24 సినిమాల్లో అడియన్స్ ఒక విధంగా చూశారని.. ఈ చిత్రంలో మరో స్థాయిలో చూస్తారని హామీ ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.

Also Read : Rana Daggubati : హీరో రానా పంచులకు భగ్గుమన్న ఆ డైరెక్టర్

CinemaPrabhasSandeep Reddy VangaSpiritTrendingUpdatesViral
Comments (0)
Add Comment