Paradha Movie : అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘పరదా’ సినిమా నుంచి కీలక అప్డేట్

తాజాగా ఇప్పుడు వచ్చిన సీనియ‌ర్ న‌టి సంగీత ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది...

Paradha : ‘సినిమా బండి’ సినిమాతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల. ఇప్పుడాయన నుంచి వస్తోన్న రెండవ చిత్రం ‘పరదా’ తో మరో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు. లేడి ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వెరీ ట్యాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), వెర్సటైల్ యాక్టర్ దర్శన రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ సినిమాలోని సంగీత లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ పాత్రలకు సై అన్నట్లుగా ‘టిల్లు స్క్వేర్’తో క్లారిటీ ఇచ్చేసింది. కానీ ఈ సినిమాలో ఓ డిఫరెంట్ పాత్ర చేసినట్లుగా ఇప్పటికే విడుదలైన ఆమె లుక్ చెబుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. అంతేకాక ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో కూడా ఇదొక వైవిధ్యభరిత చిత్రమని తెలియజేసింది.

Paradha Movie Updates

తాజాగా ఇప్పుడు వచ్చిన సీనియ‌ర్ న‌టి సంగీత ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. సంగీత ఈ చిత్రంలో రత్నమ్మగా మేకర్స్ పరిచయం చేశారు. ఈ లుక్‌లో సంగీత హోమ్లీగా, గరిటెలు పట్టుకుని వంట గదిలో నవ్వుతూ కనిపిస్తున్నారు. ఆమె పాత్ర ఈ సినిమాకు ఎంతో కీలకంగా అనేది కూడా ఈ లుక్ తెలియజేస్తోంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లలోని కొన్ని గ్రామాలలో అద్భుతమైన ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ జరప‌గా గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మాతలుగా ఆనంద మీడియా ఈ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది.

Also Read : The Raja Saab : డార్లింగ్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ నుంచి వైరల్ అవుతున్న గ్లింప్స్

Anupama ParameswaranCinemaParadhaTrendingUpdatesViral
Comments (0)
Add Comment