Upasana : రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఉపాసనకు సంబందించిన అప్డేట్ లను ఇన్‌స్టాగ్రామ్లో షేర్ చేస్తుంటారు. ఆమె ఇటీవల క్లింకారతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆ ఫోటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశారు. “ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తున్న గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్‌లో ఈ దేశ అధ్యక్షురాలిని కలవడం గొప్ప గౌరవం. ఈ అవకాశం ఇచ్చిన ప్రోగ్రాం నిర్వాహకులకు కృతజ్ఞతలు” అంటూ తమతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది.
Upasana Insta Post Viral
ఉపాసన ఇంకా తన కూతురు క్లింకార ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మెగా అభిమానులంతా “క్లింకార మొహం ఎప్పుడు చూపిస్తారు?” అని వ్యాఖ్యానిస్తున్నారు.ఇటీవల ఉపాసన(Upasana) అయోధ్యలో పర్యటించింది. ఆమె తన తాత, అపోలో వ్యవస్థాపకుడు సి.ప్రతాప్ రెడ్డితో కలిసి బలరాముణ్ణి దర్శించుకున్నారు. అంతకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also Read : Ravi Kishan : పబ్లిగ్గా తన తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేసిన రవి కిషన్