Upasana Konidela: స్వాతంత్య్ర  దినోత్సవం వేళ వైరల్ గా మారిన ఉపాసన ట్వీట్ !

స్వాతంత్య్ర  దినోత్సవం వేళ వైరల్ గా మారిన ఉపాసన ట్వీట్ !

Upasana Konidela: తన వృత్తి, ఉద్యోగం, వ్యాపారంతో సంబంధం లేకుండా సెలబ్రెటీ స్టాటస్ ను అందుకున్న మహిళ ఉపాసన కొణిదెల. అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ గానే కాకుండా మెగా ఫ్యామిలీ కోడలిగా, రామ్ చరణ్ భార్యగా ఆమె సెలబ్రెటీగా మారింది. అయితే ఎంత సెలబ్రెటీ స్టాటస్ వచ్చినప్పటికీ… దానిని ఎక్కడా మిస్యూజ్ చేయకుండా సామాజిక సమస్యలపై స్పందించడం ఆమెకు అలవాటు. ఈ నేపథ్యంలో ఇండిపెండెన్స్ సందర్భంగా రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన(Upasana Konidela) చేసిన పోస్ట్ వైరలవుతోంది. కోల్‌కతాలో వైద్యవిద్యార్థిపై జరిగిన ఘటన చూస్తుంటే మానవత్వం ఎక్కడుందని ప్రశ్నించింది. ఇంతటి అనాగరిక సమాజంలో మనం బతుకున్నామా? అని నిలదీసింది. మెడికల్ ప్రొఫెషన్‌లపై ఇంత దారుణం జరుగుతుంటే ఇక మనుషుల ప్రాణాలకు రక్షణ ఎక్కడుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Upasana Konidela Tweet

ఇంకా మనం ఇప్పటికీ అనాగరిక సమాజంలో బతుకుతున్నామంటే ఏమని స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటామని ఉపాసన ప్రశ్నించింది. ఇది ఎప్పటికీ మానవత్వం అనిపించుకోదని తెలిపింది. మహిళలే దేశానికి వెన్నెముక లాంటివారని.. ఇప్పటికే దాదాపు 50శాతం మంది వివిధ రంగాల్లో పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా హెల్త్‌ కేర్‌ రంగంలో మహిళల కృషి ఎనలేనిదని కొనియాడారు. ప్రధానంగా హెల్త్‌ కేర్‌ రంగంలోకి ఎక్కువమంది మహిళలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి మహిళ భద్రత, గౌరవం కాపాడేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Also Read : Daggubati Venkatesh: అనిల్ రావిపూడి సినిమా షూట్‌ లో అడుగెట్టిన విక్టరీ వెంకటేష్ !

Kolkata doctor rape-murder caseram charanUpasana Konidela
Comments (0)
Add Comment