Upasana Konidela: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై… మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఉపాసన తన తాత డాక్టర్ చంద్ర ప్రతాప్ రెడ్డి 91వ జన్మదినం సందర్భంగా “ది అపోలో స్టోరీ” పేరుతో చెన్నైలో బుక్ ను రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాకు స్పెషల్ గా ఇంటర్వూలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ తమిళ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఉపాసన మాట్లాడుతూ… ‘‘సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది తమిళనాడు రాజకీయాల్లో రాణించారు.
ముఖ్యమంత్రులుగా సేవలు అందించారు. విజయ్ నటుడిగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారంటే అది చాలా గొప్ప విషయం. సమాజంలో మార్పు రావాలని కోరుకునే… లీడర్ ఎవరైనా సపోర్ట్ చేయాలనేది నా అభిప్రాయం. ఒకవేళ అలాంటి వాళ్లకు సపోర్ట్ చేయకపోయినా… వెనక్కి మాత్రం లాగకూడదు. విజయ్ గొప్ప రాజకీయనాయకుడు అవుతారని భావిస్తున్నా’’ అని ఆమె అన్నారు.
Upasana Konidela Comment
ప్రస్తుతం ఉపాసన(Upasana Konidela) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు…. తాను మాత్రం రాజకీయాల్లోకి రానని ఉపాసన స్పష్టం చేశారు. అయితే మార్పు తీసుకువచ్చే నాయకుడికి మాత్రం మద్దతు ఇస్తానన్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘తమిళగ వెట్రి కళగం’ (తమిళనాడు విజయం పార్టీ) పేరుతో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టినట్లు ప్రకటించారు. దీనితో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినీ వర్గాల్లో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తాజాగా విజయ్ రాజకీయాల్లోకి రావడంపై రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Also Read : BB Gautam Krishna : వరుస హీరోలుగా పరిచయం అవుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్