Upasana and Lavanya: మెగాస్టార్ చిరంజీవి ఇంట సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతీ ఏటా హైదరాబాద్ లో చిరంజీవి నివాసంలో జరుపుకునే సంక్రాంతి వేడుకలను… ఈ ఏడాది మాత్రం కర్ణాటకలోని ఓ ఫాం హౌస్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల(Lavanya Tripathi) పెళ్లి, మెగాస్టార్ మనుమరాలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుమార్తె క్లీంకార పుట్టిన తరువాత ఇది తొలి సంక్రాంతి కావడంతో ఈ ఏడాది పండుగను ఓ వేడుకలా నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ కుటుంబంతో పాటు అల్లు అరవింద్ కుటుంబం, పవన్‌కల్యాణ్ తనయుడు అకీరా నందన్, కుమార్తె ఆద్య కూడా కర్ణాటకలో ఫాం హౌస్ లో జరగుతున్న వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఇంటి డెకరేషన్, విందు భోజనం, స్నాక్స్ – కాఫీ టైమ్, మెహందీ, యోగా టైమ్ అంటూ పలు వీడియోలను ఉపాసన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా కుటుంబం పెద్ద కోడలు ఉపాసన… కొత్త కోడలు లావణ్య త్రిపాఠీను ఉద్దేశ్యించి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ గా మారుతోంది.
Upasana and Lavanya in Sankranti
ఇటీవల తమ కుటుంబంలోనికి అడుగుపెట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠీను ఉద్దేశ్యించి… ‘‘కొత్త కోడలు ఇంటిల్లిపాదికి సున్నుండలు చేస్తోంది. ఆమె ఎంతో స్వీట్’’ అంటూ ఉపాసన ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన లావణ్య… ‘‘థ్యాంక్యూ… సూపర్ స్వీట్ పెద్ద కోడలు’’ అంటూ రిప్లై ఇచ్చారు. దీనితో వీరిద్దరి పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Also Read : Kangana Ranaut: డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన కంగనా !