Union Budget 2025- Good News : రూ. 12 ల‌క్ష‌ల వ‌ర‌కు నో ట్యాక్స్

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్

Union Budget 2025 : ఢిల్లీ – కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman) తీపి క‌బురు చెప్పారు. మ‌ధ్య త‌ర‌గ‌తి వేత‌న జీవుల‌కు భారీ ఊర‌ట‌నిస్తూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పార్ల‌మెంట్ సాక్షిగా వార్షిక ఆదాయం రూ. 12 ల‌క్ష‌లు ఉన్న వారికి ఎలాంటి ఆదాయ ప‌న్ను క‌ట్టాల్సిన ప‌నిలేద‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే ఆదాయ‌పు ప‌న్నుకు సంబంధించి కొత్త పాల‌సీని తీసుకు వ‌స్తామ‌న్నారు.

Union Budget 2025 Updates

ఇత‌ర ప‌న్ను శ్లాబ్స్ లో కూడా మార్పులు తీసుకు వ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు. గంటా 15 నిమిషాల పాటు ఆమె బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. భార‌త దేశ చ‌రిత్ర‌లో ఆర్థిక మంత్రి ఎనిమిదిసార్లు బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. దేశ వ్యాప్తంగా ఉన్న అంగ‌న్ వాడీల‌ను బ‌లోపేతం చేస్తామ‌న్నారు. రైతులు, మ‌హిళ‌లు, యువ‌త‌, విద్యా రంగానికి ప్ర‌యారిటీ ఇచ్చామ‌న్నారు.

ప్ర‌పంచం లోనే అతిపెద్ద బొమ్మ‌ల త‌యారీ దేశంగా త‌యారు చేస్తామ‌న్నారు. కొన్ని ప్రాంతాల‌ను గుర్తించి నైపుణ్యం క‌లిగిన బొమ్మ‌ల త‌యారీ పెంపొందిస్తామ‌ని తెలిపారు. యంత్రాలు, తోళ్ల ర‌హిత చెప్పుల త‌యారీకి ప్ర‌యారిటీ ఇస్తామ‌న్నారు. దీని కార‌ణంగా 22 ల‌క్ష‌ల మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి దొరుకుతుంద‌న్నారు.

స్టార్ట‌ప్ ల‌ను ప్రోత్స‌హిస్తామ‌న్నారు. ఎంఎస్ఎంఈల‌పై దృష్టి సారిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఒక కోటికి పైగా న‌మోదు కావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. బీహార్ లోని పాట్నా ఐఐటీని విస్త‌రిస్తామ‌న్నారు. సాంకేతిక ప‌రిజ్ఞానం అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. విద్యా రంగంలో ఏఐని అనుసంధానం చేస్తామ‌న్నారు.

Also Read : Artiste Movie New Song Attracts : చూస్తూ చూస్తూ నేనే నీవై పోయా

2025Union BudgetUpdatesViral
Comments (0)
Add Comment