Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’లో మరో ఇద్దరు కొత్త హీరోయిన్లు !

మెగాస్టార్ 'విశ్వంభర'లో మరో ఇద్దరు కొత్త హీరోయిన్లు !

Vishwambhara: బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా ‘విశ్వంభర(Vishwambhara)’. చిరు కెరీర్ లో అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత సోషియోఫాంటసీ జానర్ లో పూర్తిస్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లో ఇటీవల సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష జాయిన్ అయింది. సుమారు పద్దెనిమిదేళ్ళ తరువాత మేమిద్దరం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నామంటూ మెగాస్టార్ చిరంజీవి దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ఈ సినిమాలో అనుష్కశెట్టి, మృణాల్ ఠాకూర్ కూడా నటింస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

Vishwambhara Movie Updates

అయితే అనూహ్యంగా ఇద్దరు యంగ్ హీరోయిన్లు ఈ సినిమాలో భాగస్వాములు అయినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన షూటింగ్ లో ఇషా చావ్లా, సురభి లు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీరిద్దరిపై కొన్ని సీన్స్‌ చిత్రీకరించారని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయిన సైలెంట్‌ గా వీరిద్దరితో షూటింగ్‌ కూడా ప్రారంభించారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌ లో ప్రారంభం కాబోయే తదుపరి షెడ్యూల్‌ లో త్రిషతో పాటు ఇషా చావ్లా, సురభి కూడా పాల్గొంటారని టాక్‌.

యూవీ క్రియోషన్స్ బ్యానర్ పై ‘బింబిసార’ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘విశ్వంభర’. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ‘మెగాస్టార్‌ స్వచ్ఛమైన ఫాంటసీ జోనర్‌ చిత్రంలో నటించి మూడు దశాబ్దాలు అవుతోంది. ఈ సినిమా కోసం సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి.కి ఆధ్యాత్మికతను జోడిస్తూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు’ అని ఈ సినిమాపై దర్శకుడు వశిష్ఠ అంచనాలు పెంచేశారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నట్లు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. దీనితో ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Payal Rajput: తల్లి మోకాలి ఆపరేషన్ పై సెక్సీ బ్యూటీ ఎమోష‌న‌ల్ పోస్ట్ !

Isha ChawlaMegastar ChiranjeeviSurabhiVishwambhara
Comments (0)
Add Comment