Cannes Film Festival: యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండు భారతీయ సినిమాలు పోటీ పడనున్నాయి. రాధికా ఆప్టే ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘సిస్టర్ మిడ్‌నైట్’ సినిమా ‘డైరెక్టర్స్ ఫార్టునైట్’ విభాగంలో ప్రదర్శితం కానుంది. దీనికి కరణ్ కాంధారి దర్శకుడు. భారత్ నుంచి ఈ విభాగానికి ఎంపికైన ఒకే ఒక చిత్రం ఇది. కోటి ఆశలతో కొత్త కాపురంలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయి అనుకోని సమస్యల్లో ఇరుక్కొని.. దానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఏం చేసిందో ఇందులో చూపించారు. హాస్యం, ప్రేమలకు సైతం ఇందులో చోటుందని సినీవర్గాలు తెలిపాయి. వెల్లింగ్టన్ ఫిల్మ్స్, రాధికా ఆప్టే, సూటబుల్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
Cannes Film Festival Updates
మరోవైపు సిక్కిం దర్శకుడు సామ్తెన్ భుటియా దర్శకత్వం వహించిన ‘తార: ది లాస్ట్ స్టార్’ ప్రదర్శనకు ఎంపికైంది. దీన్ని సావిత్రీ ఛెత్రీ నిర్మించారు. హిమాలయ పర్వత సానువులు, సిక్కిం రాష్ట్రంలోని ప్రజల సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ సోషల్ డ్రామాని తెరకెక్కించారు. స్థానిక నటీనటులే ప్రధాన పాత్రలు పోషించారు’ అని దర్శకుడు తెలిపారు. ఈ అరుదైన ఘనత అందుకోవడం పట్ల సినీబృందానికి సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమంగ్ అభినందనలు తెలిపారు.
Also Read : Shweta Basu Prasad: కొత్త అవతారంలో ‘కొత్త బంగారు లోకం’ ముద్దుగుమ్మ !