Twin Heros: ఒకే వ్యక్తి రెండు వేరు వేరు పాత్రలు పోషించడం ద్విపాత్రాభినయం. ప్రస్తుతం సినిమాల్లో ద్విపాత్రాభినయం అనేది సర్వ సాధారణం. అలాగే ఇద్దరు సోదరులు ఒకే సినిమాలో నటించడం కూడా సర్వ సాధారణమే. ఉదాహరణకు నాగేంద్రబాబు, చిరంజీవి. అయితే ఆ ఇద్దరు సోదరులు కవల పిల్లలు కావడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘనత టాలీవుడ్ సొంతం కాబోతుంది. హరికృష్ణ, రామకృష్ణ అనే ఇద్దరు కవల పిల్లలు హీరోలుగా ఆని, రేఖ నిరోషా హీరోయిన్లుగా ‘తికమకతాండ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు
Twin Heros – మతిమరుపు కాన్సెప్ట్‌తో కవల సోదరులు హీరోలుగా ‘తికమకతాండ’
మతిమరుపు కాన్సెప్ట్‌తో టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరికృష్ణ, రామకృష్ణ, ఆని, రేఖ నిరోషా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కించిన చిత్రం తికమకతాండ. గౌతమ్ మీనన్(Gawtham Menon), చేరన్, విక్రమ్ కె కుమార్ వంటి స్టార్ డైరెక్టర్లు దగ్గర కో డైరెక్టర్ గా పనిచేసిన వెంకట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 15న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మేకర్స్ హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాతలు సి. కల్యాణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ హాజరయ్యారు. బొబ్బిలి సురేష్ సంగీతం అందించిన ఈ సినిమాలో శివన్నారాయణ, రాకెట్ రాఘవ, యాదమ రాజు, భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. రాజన్న సినిమాతో బాల నటిగా నంది అవార్డు అందుకున్న ఆని… ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం ఓ విశేషం. ట్విన్స్ టెక్నీషియన్స్ గా ఆన్ స్క్రీన్ పనిచేయడం టాలీవుడ్ లో ఇదే మొట్టమొదటి సారి.
Also Read : Hero Abhiram: ఘనంగా దగ్గుబాటి అభిరామ్ వివాహం