Turbo: విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ఛాలెంజింగ్ ప్రాజెక్టులను ఎంచుకోవడంలో ముందుండే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా సినిమా ‘టర్బో’. వైశాక్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సినిమాను మమ్ముట్టి సొంత నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ పతాకంపై రూపొందించారు. రెండు నెలల క్రితం అంటే మే23న న థియేటర్లలో విడుదలై విజయం సాధించిన ఈ యాక్షన్ మూవీ… ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఓ రోజు ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. టర్బో జోష్ పాత్రలో మమ్ముట్టి నటించగా మన తెలుగు కమెడియన్ సునీల్, కన్నడ నటుడు రాజ్ బీ షెట్టి కీలక పాత్రల్లో నటించారు.
Turbo Movie..
ఒక టర్బో కథ విషయానికి వస్తే… టర్బో(Turbo) జోష్ ఊర్లో ఖాళీగా ఉంటూ తగాదాల్లో తలదూరుస్తూ గొడవలు పడుతూ, కొట్లాడుతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అనుకోకుండా జరిగిన ఇష్యూతో చెన్నైకి వెళ్లాల్సి వస్తుంది. మరోవైపు టర్బో జోష్ బెస్ట్ ఫ్రెండ్ జెర్రీ చెన్నైలో ఓ బ్యాంక్‌లో పని చేస్తుంటాడు. అయితే ఆ బ్యాంక్ లో క్లోజ్ అయిన ఓ అకౌంట్ లో తన పాస్‌వర్డ్ ఉపయోగించి కోట్లలో నగదు లావాదేవీలు జరగడం గమనించి షాకవుతాడు. తర్వాత ఎవరు ఈ పని చేస్తున్నారో తెలుసుకుని తీవ్ర సమస్యల్లో చిక్కుకుంటాడు.
అదే సమయంలో టర్బో జోష్ ఈ విషయం తెలుసుకుని మిత్రునికి మద్దతుగా రంగంలోకి దిగుతాడు. ఈ నేపథ్యంలో టర్బో ఈ ఇష్యూను పరిష్కరించాడా లేదా అనే కథకథనాలతో కామెడీతో సాగుతూ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. చూసే వారికి రెగ్యులర్ కమెర్షియల్ సినిమాలానే అనిపించినా ఎక్కడా బోర్ కొట్టకుండా చివరి వరకు సింపుల్‌గా నడిచిపోతుంది. అంజనా జయ ప్రకాశ్ ఈ మూవీలో కథానాయికగా నటించింది.
Also Read : Raj Tarun – Lavanya Case: హీరో రాజ్‌తరుణ్‌కు హైకోర్టులో భారీ ఊరట !