Hero Ravi Teja-Mass Jathara :మాస్ మ‌హారాజా సాంగ్ మాస్ జాత‌ర

తూ మేరా ల‌వ్వ‌ర్ పెట్టావే చెవిలో కాలీ ఫ్ల‌వ‌ర్

Mass Jathara : టాలీవుడ్ లో మాస్ లుక్ తో అల‌రించే న‌టుడు ర‌వితేజ(Ravi Teja). త‌న‌ను అంతా మాస్ మ‌హారాజా అంటారు. డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ లో ప‌ని చేసిన త‌ను అనుకోకుండా న‌టుడ‌య్యాడు. ఆ త‌ర్వాత టాప్ హీరోల‌లో ఒక‌డిగా నిలిచాడు. ప్ర‌త్యేకించి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర ఇస్తే చాలు ఇర‌గ‌దీస్తాడు. ఆ మ‌ధ్య‌న గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బ‌లుపు లో త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. ప్రేక్ష‌కులను మెస్మ‌రైజ్ చేశాడు. న‌ట‌నే కాదు డ్యాన్సుల‌తో హోరెత్తించ‌గ‌ల‌డు. అంత‌కు మించి డైలాగుల‌తో దుమ్ము రేప‌గ‌ల‌డు. స‌త్తా క‌లిగిన ద‌ర్శ‌కుడి చేతిలో త‌ను ప‌డితే ఇక ఆ సినిమా ఓ రేంజ్ లో ఆడ‌టం ఖాయం.

Mass Jathara Movie Song Viral

తాజాగా పూర్తిగా యాక్ష‌న్ , థ్రిల్ల‌ర్ ఓరియెంటెడ్ గా వ‌స్తోంది మాస్ జాత‌ర‌(Mass Jathara). టైటిల్ కు త‌గ్గ‌ట్టుగానే పోస్ట‌ర్స్ , టీజ‌ర్, సాంగ్ కూడా ఉంది. తాజాగా మూవీ మేక‌ర్స్ ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ ను విడుదల చేశారు. సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీలో అద్భుత‌మైన పాట రాసిన భాస్క‌ర‌బ‌ట్ల ర‌వికుమార్ క‌లం లోంచి మ‌రో మాస్ హిట్ సాంగ్ వ‌చ్చేసింది. గ‌తంలో ఇడియ‌ట్ లో హిట్ అయిన ప‌ల్ల‌విని మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సిసిరోలియో తీసుకుని ఈ పాట‌కు ప్రాణం పోశాడు.

ఇక భాస్క‌ర‌భ‌ట్ల ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ ను డిఫ‌రెంట్ గా రాశాడు. హీరో త‌న ల‌వ‌ర్ ను పిచ్చిగా తిట్టుకుంటూ పాడే పాట ఇది. తూ మేరా ల‌వ్వ‌ర్ ల‌వ్వ‌ర్ ల‌వ్వ‌రూ మే తుజ్ దియా ఫ్ల‌వ‌ర్..పెట్టావే చెవిలో కాలి ఫ్ల‌వ‌రూ అంటూ సాగింది. నీలాగా న‌చ్చ‌లేదే గిచ్చ లేదో ఎవ‌రూ ..చొక్కాలే చింపు కోవాలే నాకు లాగే అంద‌రూ..నువ్వేమో తుల‌సి కోటా లోన గాంజా ఫ్లేవ‌రు..మీ బాబు నిన్ను మించి ఇంకా పెద్ద లోఫ‌రూ అంటూ డిఫ‌రెంట్ గా రాశాడు ర‌చ‌యిత‌. ఈ పాటకు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అదేమిటంటే దివంగ‌త మ్యూజిక్ డైరెక్ట‌ర్ చ‌క్రి వాయిస్ ను ఇమిటేట్ చేశారు. ఏఐ టెక్నాల‌జీని ఇందు కోసం ఉప‌యోగించుక‌న్నారు. మొత్తంగా సాంగ్ మాస్ జాత‌ర‌ను త‌ల‌పించేలా ఉంది.

Also Read : Victory Venkatesh-Trivikram :వెంకీ మామ‌తో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మూవీ రెడీ..?

Mass JatharaMass Maharaj Ravi TejaSongTrendingUpdates
Comments (0)
Add Comment