Trivikram Son – Spirit :’వంగా’ వ‌ద్ద త్రివిక్ర‌మ్ కొడుకు శిష్య‌రికం

ప్ర‌భాస్ స్పిరిట్ మూవీలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ 

Trivikram : తెలుగు సినిమా చ‌రిత్ర‌లో చెర‌ప‌లేని పేరు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. కేవ‌లం మాట‌ల‌తోనే సినిమాల‌ను స‌క్సెస్ చేయొచ్చని నిరూపించిన ద‌ర్శ‌కుడు. త‌ను ప్రిన్స్ మ‌హేష్ బాబుతో తీసిన అత‌డు సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన సినిమాల‌న్నీ వేటిక‌వే ప్ర‌త్యేకం. తెర పైనే కాదు స్క్రీన్ వెనుక కూడా నిత్యం సాహిత్యం గురించి, పాట‌ల గురించి, సంగీతం గురించి అల‌వోక‌గా చెప్ప‌డంలో త‌న‌కు త‌నే సాటి. సినీ ఇండ‌స్ట్రీలో సినిమాకు సంబంధించి 24 ఫ్రేముల గురించి ఏక‌బిగిన చెప్పే ద‌ర్శ‌కుల‌లో రామ్ గోపాల్ వ‌ర్మ కాగా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్(Trivikram) మ‌రొక‌రు.

Trivikram Srinivas Son Training at Spirit Movie Director

త‌ను దిగ్గ‌జ‌మైన ద‌ర్శ‌కుడిగా పేరు పొందాడు. ఈ మ‌ధ్య‌నే మ‌హేష్ బాబుతో గుంటూరు కారం తీశాడు. ప్ర‌స్తుతం త‌దుప‌రి చిత్రం పుష్ప‌2 ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో క‌లిసి తీయ‌బోతున్నాడు. ఈ త‌రుణంలో కీల‌క‌మైన అప్ డేట్ వ‌చ్చింది. అదేమిటంటే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ త‌న‌యుడు శ్రీ‌నివాస్ రిషి  సంచ‌లనంగా మారారు.

దీనికి కార‌ణం త‌ను అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా డైన‌మిక్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి వ‌ద్ద చేర‌డం. త‌ను చేయ‌బోయే సినిమా ప్ర‌భాస్ న‌టిస్తున్న స్పిరిట్. ప్రస్తుతం దీనిపై బిజీగా ఉన్నాడు. ఇటీవ‌లే ర‌ణ్ బీర్ క‌పూర్, ర‌ష్మిక మంద‌న్న తో క‌లిసి తీసిన యానిమ‌ల్ రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ స‌మ‌యంలో తాను డార్లింగ్ తో తీయబోయే స్పిరిట్ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సంద‌ర్బంగా త్రివిక్ర‌మ్ కొడుకు ఇందులో ద‌ర్శ‌క‌త్వ  ప‌రంగా పాలు పంచుకోవ‌డం విశేషం. తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా పేరు తెచ్చుకుంటాడ‌ని ఆశిద్దాం.

Also Read : Ramam Raghavam Sensational :భావోద్వేగాల స‌మ్మేళ‌నం రామం రాఘ‌వం

Sandeep Reddy VangaTrendingTrivikram SrinivasUpdates
Comments (0)
Add Comment