Venkatesh : టాలీవుడ్ లో మాటల మాంత్రికుడిగా, మినిమం గ్యారెంటీ కలిగిన దర్శకుడిగా గుర్తింపు పొందాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సినిమాను ఇంటిల్లిపాది చూసేలా చేయడంలో తనకు తనే సాటి. ప్రత్యేకించి తను రాసే మాటల కోసం ప్రేక్షకులు థియేటర్ల వద్దకు వస్తారు. అలాంటి ప్రత్యేకతను తను కలిగి ఉన్నాడు. తను మహేష్ బాబుతో తీసిన అతడు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచి పోయింది. గుంటూరు కారం తీశాడు. పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది తీశాడు.
Venkatesh Trivikram Srinivas Movie Updates
ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నితిన్ తో , అల్లు అర్జున్ తో మూడు సినిమాలు తీశాడు. అన్నీ బిగ్ హిట్స్ గా నిలిచాయి. వాటిలో సన్నాఫ్ సత్య మూర్తి, జులాయి, అల వైకుంఠపురంలో.. తను తీసే ప్రతి మూవీలో పాటలు, మాటలు, హత్తుకునే సన్నివేశాలు తప్పకుండా ఉంటాయి. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత సెన్సేషన్ గా నిలిచింది. తాజాగా విక్టరీ వెంకటేశ్(Venkatesh) కు కథ చెప్పాడని, ఆయనకు తెగ నచ్చేసిందని, దీంతో ప్రోసీడ్ కావాలని సూచించినట్లు టాలీవుడ్ లో టాక్. తనకంటూ ఓ జానర్ ఉంది.
ఇంటిల్లిపాది కలిసి చూసేలా తను సినిమా చేయాలని అనుకుంటాడు విక్టరీ వెంకటేశ్. ఇక మాటలతో మంటలు రేపడమే కాదు భారీ కలెక్షన్స్ వసూలు చేసేలా చేయడంలో తనకు తనే సాటి. కామెడీతో పాటు కనెక్టివిటీ కలిగి ఉండేలా, పంచ్ లు ప్రాసలు కుదిరేలా చేయడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ది అందె వేసిన చేయి. ఈ ఇద్దరి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ కావడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. వరుస సినిమాలతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు వెంకీ మామ. తను నటించిన ఎఫ్ 1, ఎఫ్ 2, సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కాగా ఈ ఇద్దరి మూవీకి సంబంధించి ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు త్రివిక్రమ్ శ్రీనివాస్.
Also TRead : Hero Allu Arjun-Janhvi :ఐకాన్ స్టార్ తో బాలీవుడ్ ముద్దుగుమ్మలు