Trivikram Srinivas Sensational :వినోదం అద్భుతం న‌వ్వించ‌డం క‌ష్టం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్

Trivikram Srinivas : మాట‌ల మాంత్రికుడిగా పేరొందిన ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌ను తార‌క్ తో క‌లిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ్యాడ్ స్క్వేర్ స‌క్సెస్ మీట్ లో . ఈ చిత్రం భారీ విజ‌యాన్ని సాధించింది. బాక్సులు బ‌ద్ద‌ల‌య్యేలా వ‌సూళ్లు అయ్యాయి. ఈ సంద‌ర్బంగా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్(Trivikram Srinivas) వినోదం గురించి ప్ర‌స్తావించారు. ప్ర‌తి సినిమా స‌క్సెస్ కావాల‌ని తీస్తామ‌ని అన్నాడు. ఒక్కోసారి వినోదాన్ని పండించడం స‌వాల్ తో కూడుకున్న ప‌ని అని అన్నారు.

Trivikram Srinivas Sensational Comments

జీవితంలో నిరాశ నుంచి గ‌ట్టెక్కాలంటే కాస్తంత రిలీఫ్ గా ఉండేందుకు కామెడీ తోడ్ప‌డుతుంద‌న్నాడు. త‌న సినిమాలో ఎక్కువ‌గా డైలాగుల‌తో పాటు క‌నిపించ‌ని కామెడీకి ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇస్తాన‌న్నాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. సినిమాల‌ను తీయ‌డం సుల‌భ‌మేన‌ని, కానీ వినోదాన్ని పండించాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌న్నాడు ద‌ర్శ‌కుడు. క‌డుపుబ్బా న‌వ్వించిన ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ శంక‌ర్ ను ప్ర‌త్యేకంగా అభినందిస్తున్న‌ట్లు చెప్పాడు.

ఇదిలా ఉండ‌గా ఇప్పుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ చ‌ర్చ‌ల్లో ఉన్నాడు. బ‌న్నీతో త‌దుప‌రి చిత్రం తీయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని బ‌న్నీ కూడా ప్ర‌క‌టించాడు. త‌ను త‌మిళ సినీ ద‌ర్శ‌కుడు అట్లీతో న‌టించ‌నున్నాడు. గ‌తంలో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ జులాయి, అల వైకుంఠ పురలో న‌టించాడు. ప్ర‌స్తుతం మూడో సినిమా చేయ‌బోతున్నాడు. అయితే ఈ రాబోయే మూవీ పౌరాణిక నేప‌థ్యంగా ఉండోబోతోంద‌ని స‌మాచారం.

Also Read : Vijay Deverakonda Shocking :బాలీవుడ్ పై రౌడీ కామెంట్స్ క‌ల‌క‌లం

CommentsTrivikram SrinivasViral
Comments (0)
Add Comment