Trivikram-Allu Arjun : డైరెక్టర్ త్రివిక్రమ్ తో తదుపరి సినిమాకి సిద్ధమవుతున్న బన్నీ

గుంటూరు కారం విడుదలకు ముందే.. బన్నీ, త్రివిక్రమ్ సినిమా ప్రకటించారు...

Trivikram : ఇంతకుముందు ఈ పాట కేవలం తెలుగులో మాత్రమే పాడుకునే వాళ్లం.. కానీ ఇప్పుడు ఇండియా అంతా పాడుకుంటుంది అల్లువారి పిలగా నువ్ ఇరగ్గొట్టేస్తున్నావ్ అని..! పుష్ప గాడి రూల్ చూసాక.. ఆ బ్రాండ్ చూసాక తర్వాత బన్నీ ఏం చేసినా.. దాన్ని మ్యాచ్ చేయగలరా అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఇప్పటికే త్రివిక్రమ్‌తో లాక్ చేసారు అల్లు అర్జున్.

Trivikram-Allu Arjun Movie Updates

గుంటూరు కారం విడుదలకు ముందే.. బన్నీ, త్రివిక్రమ్(Trivikram) సినిమా ప్రకటించారు. కాకపోతే ఈసారి రొటీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాకుండా.. పర్ఫెక్ట్ ప్యాన్ ఇండియన్ సినిమా ప్లాన్ చేస్తున్నారు గురూజీ. అందుకే ప్రీ ప్రొడక్షన్ కోసం చాలా టైమ్ తీసుకుంటున్నారు. పీరియాడ్ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. మైథాలజీ టచ్ కూడా ఇందులో ఉండబోతుందని తెలుస్తుంది. త్రివిక్రమ్ కంటే ముందు అట్లీ పేరు బన్నీ దర్శకుల లిస్టులో బలంగా వినిపించింది.. పైగా పుష్ప 2 విడుదలయ్యాక ట్వీట్ కూడా చేసారీయన. అయితే అట్లీని కాదని తనకు హ్యాట్రిక్ ఇచ్చిన త్రివిక్రమ్‌కే ఓటేసారు అల్లు అర్జున్.

దీనిబట్టిబన్నీ ఇమ్మీడియట్‌గా చేసే సినిమా కూడా గురూజీతోనే అని ఫిక్స్ అయిపోయారు సినీ ప్రేమికులు. పుష్ప 3 అనౌన్స్ చేసినా.. ఆల్రెడీ రామ్ చరణ్, సుకుమార్ సినిమా ప్రకటించారు కాబట్టి.. ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా టైమ్ పడుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తర్వాత ఓ మంచి వీడియోతో త్రివిక్రమ్, బన్నీ ప్రాజెక్ట్ ప్రకటించనున్నారు. ఐదేళ్లుగా గడ్డంతోనే ఉన్న బన్నీ.. గురూజీ కోసం బాగానే మేకోవర్ కానున్నారు. ఈలోపు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు మాటల మాంత్రికుడు. గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమా 2025 జూన్ తర్వాత సెట్స్‌పైకి రానుంది.

Also Read : Pushpa 2 : పుష్ప రాజ్ పై అమితాబ్ ప్రశంసల వెల్లువ

allu arjunMoviesTrendingTrivikram SrinivasUpdatesViral
Comments (0)
Add Comment