Trisha-Mansoor: దెబ్బకు దిగొచ్చిన మన్సూర్ ఆలీఖాన్…

దెబ్బకు దిగొచ్చిన మన్సూర్ ఆలీఖాన్... త్రిషకు క్షమాపణ చెప్పిన మన్సూర్

Trisha-Mansoor : కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ ఎట్టకేలకు దిగొచ్చాడు. దక్షిణాది అగ్ర కథానాయిక త్రిషపై తాను చేసిన వ్యాఖ్యలకు మన్సూర్ ఆలీఖాన్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. తన క్షమాపణలకు సంబంధించిన వీడియోను… ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాల నెట్టింట పోస్ట్ చేశారు… ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

త్రిష పెళ్ళికి మంగళ సూత్రం ఇస్తానంటూ క్షమాపణ చెప్పిన మన్సూర్

మన్సూర్ పోస్ట్ విషయానికి వస్తే ‘నా సహనటి… త్రిష… దయచేసి నన్ను క్షమించండి. నాకు మీపై ఎటువంటి దురుద్దేశం లేదు. నేను ఆ ఇంటర్వ్యూలో చాలా సరదాగా అన్న మాటలవి. మీపై నాకు గౌరవం ఉంది. మీ పెళ్లికి మంగళసూత్రం ఇచ్చి ఆశీర్వదించాలని అనుకుంటున్నా’నంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

Trisha-Mansoor – మన్సూర్ పోస్ట్ పై స్పందించిన త్రిష

తనకు క్షమాపణలు చెప్తూ మన్సూర్ ఆలీఖాన్(Mansoor Ali Khan) చేసిన పోస్టుపై త్రిష పరోక్షంగా స్పందించారు. “తప్పు చేయడం మానవ సహజం… క్షమాపణ అత్యుత్తమ మైనది అంటూ ఆమె పోస్ట్ చేసారు. దీనితో త్రిష, మన్సూర్ ల వివాదానికి చెక్ పెట్టినట్లైయింది.

త్రిష, మన్సూర్ ల వివాదానికి కారణం ఏమిటంటే ?

స్టైలిష్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్, త్రిష జంటగా తెరకెక్కిన ‘లియో’ సినిమాలో నటించిన మన్సూర్ అలీఖాన్… ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో “గతంలో నేను ఎన్నో రేప్‌ సీన్లలో నటించాను. ‘లియో’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నాను. అయితే అలాంటి సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించింది” అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

దీనితో పలువురు సినీ ప్రముఖులు మన్సూర్ వ్యాఖ్యలు ఖండిస్తూ త్రిషకు మద్దత్తు తెలుపుతున్నారు. మరోవైపు మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్‌… ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి… మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు త్రిషకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నడిగర్ సంఘం మన్సూర్ ను పాక్షికంగా నిషేధం విధించింది. దీనితో దిగొచ్చిన మన్సూర్ త్రిషకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు.

Also Read : Adivi Sesh: అడివి శేష్‌పై ఫిర్యాదుకు సిద్ధపడిన నెటిజన్‌

Mansoor Ali Khantrisha
Comments (0)
Add Comment