Trisha Krishnan : వర్షం సినిమాపై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

వర్షం సినిమా కోసం ఏకంగా 40 రోజుల పాటు నీటిలో తడుస్తూ షూటింగ్‌లో పాల్గొన్నాను...

Trisha Krishnan : తమిళ బ్యూటీ త్రిష ది సక్సెస్‌ఫుల్‌ జర్నీ. 40 ఏళ్లు వయసు మీద పడినా.. ఇండస్ట్రీలోకి వచ్చి 20ఏళ్లు దాటినా తన క్రేజ్‌, తనలోని ఈజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కోలీవుడ్‌. టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో అతి కొద్ది మంది హీరోయిన్లు మాత్రమే లేటు వయసులో అందాలను ఆరబోస్తు వరుసగా హీరోయిన్స్‌గా సినిమాలు చేస్తూ ఉన్నారు. దక్షిణాదిలో త్రిష(Trisha Krishnan) స్థాయి సీనియర్‌ హీరోయిన్లు.. ప్రస్తుతం అవకాశాల్లేక ఖాళీగా ఉన్నారనే చెప్పాలి. కొందరు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నా వారు తల్లి వదిన క్యారెక్టర్లతో సరిపుచ్చుకుంటున్నారు. కానీ త్రిష మాత్రం తన జోరు ఇప్పటికి తగ్గించలేదు. ప్రస్తుతం చిరంజీవితో నటిస్తూ ఉండగా, తమిళ్‌లో సూపర్‌ స్టార్స్ అందరితో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. తెలుగు, తమిళంలో దాదాపు అందరు హీరోలతో నటించిన ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో కలిసి నటించిన ‘వర్షం’ గురించిన పలు విషయాలను పంచుకుంది.

Trisha Krishnan Comments..

“వర్షం సినిమా కోసం ఏకంగా 40 రోజుల పాటు నీటిలో తడుస్తూ షూటింగ్‌లో పాల్గొన్నాను. షూటింగ్‌ మొదలవ్వడానికి ముందే నీటిలో ఎక్కువగా తడుస్తూ నటించాల్సి ఉంటుందని ఆ సినిమా డైరెక్టర్‌ శోభన్‌ చెప్పారు. కానీ ఆ స్థాయిలో నీటిలో తడుస్తూనే ఉండాలని నేను అనుకోలేదు. ఎక్కువ రోజులు నీటిలో తడుస్తూనే షూట్‌లో పాల్గొన్నాను. సన్నివేశాలు కాకుండా ఓ పాటను సైతం వర్షంలో చిత్రీకరించారు. ఆ దెబ్బకు వర్షంలో షూటింగ్‌ అంటేనే భయం వేసింది’’ అని త్రిష తెలిపింది.

Also Read : Allu Arjun-Pushpa 2 : టికెట్ రేట్ల పెంపునకు ఆమోదించిన ఏపీ సర్కార్ కు ధన్యవాదాలు తెలిపిన బన్నీ

CommentsTrendingTrisha KrishnanViral
Comments (0)
Add Comment