Trisha Krishnan : 20 ఏళ్ల తర్వాత హీరో సూర్య తో సినిమా చేస్తున్న త్రిష

దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ సూర్య, త్రిష ఇందులో జంటగా నటిస్తుండడం విశేషం...

Trisha Krishnan : తమిళ హీరో సూర్య నటించే 45వ చిత్రం ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ పొల్లాచ్చిలో జరుగుతోంది. ఇందులో హీరోయిన్‌గా త్రిష నటిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు చెప్పారు.

Trisha Krishnan Movie Updates

దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ సూర్య, త్రిష ఇందులో జంటగా నటిస్తుండడం విశేషం. పేరు నిర్ణయించని ఈ సినిమాలో సూర్య, త్రిష ఇద్దరూ లాయర్‌ పాత్రలు పోషిస్తుండడం మరో విశేషం. హై బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్జే బాలాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read : Balakrishna-Allu Arjun : అల్లు అర్జున్ కి ఫోన్ చేసి మాట్లాడిన బాలకృష్ణ

MoviesSuryaTrendingTrisha KrishnanUpdatesViral
Comments (0)
Add Comment