Trisha Krishnan: సల్మాన్‌ సరసన త్రిష ?

సల్మాన్‌ సరసన త్రిష ?

Trisha Krishnan: నాలుగు పదుల వయసుకు చేరువలోనూ దక్షిణాది భాషల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న నటి త్రిష. ఇటీవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’, ‘లియో’ సినిమాల్లో అదిపోయే నటనతో ఆమె ప్రేక్షకులను మెప్పించి… 2023లో రెండు భారీ విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ అని తేడా లేకుండా దాదాపు అన్ని దక్షిణాది భాషల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన త్రిష… సుమారు 13 ఏళ్ళ క్రితం అక్షయ్‌ కుమార్‌తో కలిసి ‘ఖట్టా మీఠా’ అనే కామెడీ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో తరువాత ఈమెకు బాలీవుడ్ నుండి ఆఫర్లు వచ్చినప్పటికీ…. దక్షిణాది సినిమాలతో బిజీగా ఉండటం వలన ఆ ఆఫర్స్ ను తిరస్కరించాల్సి వచ్చిందని సమాచారం. అయితే సుమారు 13 ఏళ్ళ తరువాత మరలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది.

Trisha Krishnan Movie Updates

‘ఖట్టా మీఠా’ సినిమాతో 13 ఏళ్ళ క్రితం అక్షయ్ కుమార్ తో సందడి చేసిన త్రిష(Trisha Krishnan)… ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌తో ‘ది బుల్‌’ అనే చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరించగా… ప్రముఖ దర్శకుడు విష్ణు విర్ధన్‌ తెరకెక్కించనున్నట్లు సమాచారం. దాదాపు 25ఏళ్ల అనంతరం సల్మాన్‌ ఖాన్, కరణ్‌ జోహార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై చిత్రవర్గాలో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనితో బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో భాగం కాబోతున్నందుకు త్రిషకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం త్రిష ‘విదాముయార్చి’, ‘ఐడెంటిటీ’ సినిమాలతో బిజీగా ఉంది.

Also Read : Prabhas Post : వైరల్ అవుతున్న ప్రభాస్ ఇంస్టాగ్రామ్ పోస్ట్

Salman KhanTrisha Krishnan
Comments (0)
Add Comment