Trisha Krishnan: రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న త్రిష ‘ఐడెంటిటీ’

రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న త్రిష ‘ఐడెంటిటీ’

Trisha Krishnan: టోవినో థామస్‌, త్రిష జోడీగా దర్శక ద్వయం అఖిల్‌ పాల్‌, అనాస్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఐడెంటిటీ’. ‘2018’ సంచలనం విజయం తర్వాత టోవినో థామస్ నటిస్తున్న ఈ సినిమా భారీగా అంచనాలు ఉన్నాయి. మరోవైపు దక్షిణాది అగ్రతార త్రిష కూడా కథానాయిక కావడం ఈ సినిమా మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనితో ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతూ… రెండో షెడ్యూల్‌ ఇటీవలే ముగిసింది. ఇందులో కొన్ని కీలకమైన పతాక యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం.

Trisha Krishnan Movies

ఇదేవిషయాన్ని దర్శకద్వయం అఖిల్‌ పాల్‌, అనాస్‌ ఖాన్‌ తెలియజేస్తూ… త్వరలో చివరి షెడ్యూల్‌ కి వెళ్లనున్నట్టు ఆదివారం తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అంతేకాదు టోవినో థామస్‌, త్రిషలతో ఉన్న ఓ ఫొటోని జత చేశారు. మరోవైపు టోవినో నటించిన ‘నడికర్‌’ మే 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఫోరెన్సిక్, 2018 వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్టయ్యారు టోవినో థామస్. మరోవైపు త్రిష … టాలీవుడ్ లో అగ్రతార దీనితో వీరిద్దరి సినిమాపై తెలుగు ప్రేక్షకులు కూడా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Mahesh Babu: మహేశ్‌ జుట్టులాగి ఆటపట్టించిన మంజుల ! వైరల్ అవుతోన్న వీడియో !

IdentityTovino ThomasTrisha Krishnan
Comments (0)
Add Comment