Trisha Krishnan: టోవినో థామస్, త్రిష జోడీగా దర్శక ద్వయం అఖిల్ పాల్, అనాస్ ఖాన్ తెరకెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’. ‘2018’ సంచలనం విజయం తర్వాత టోవినో థామస్ నటిస్తున్న ఈ సినిమా భారీగా అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో త్రిష తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ… ఇన్ స్టా వేదికగా కొన్ని ఫొటోల్ని పంచుకుంది చిత్రబృందం. ‘‘ఐడెంటిటీ’లో త్రిష పాత్ర చిత్రీకరణ ముగిసింది. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఆమె మా ప్రాజెక్టులో భాగమయినందుకు సంతోషంగా ఉంది. మా మీద నమ్మకం ఉంచి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు’’ అని వ్యాఖ్యల్ని జోడించింది.
Trisha KrishnanMovies
గతేడాది ‘లియో’తో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక త్రిష. పరిశ్రమకి వచ్చి రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ తన అందం అభినయంతో మెప్పిస్తున్న ఈ భామ.. ప్రస్తుతం అగ్రహీరోల సరసన నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలుగులో ‘విశ్వంభర’, ‘థగ్ లైఫ్’ ‘విదాముయార్చి’ తదితర చిత్రాలతో బిజీగా ఉంది త్రిష.
Also Read : Puri Jagannadh: పూరి జగన్నాథ్ స్పెషల్ గిఫ్ట్ గా ‘డబుల్ ఇస్మార్ట్ రీక్యాప్’ !