Beauty Trisha Movie : త్రిష కృష్ణ‌న్ ‘ఐడెంటిటీ’ రిలీజ్ కు రెడీ

మ‌ల‌యాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్

Trisha : మ‌ల‌యాళంలో త్రిష కృష్ణ‌న్ , టోవినో థామ‌స్ న‌టించిన ఐడెంటిటీ దుమ్ము రేపుతోంది. బాక్సులు బ‌ద్ద‌లు కొడుతోంది. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించ‌డంతో సినీ వ‌ర్గాలు విస్తు పోయాయి. కేవ‌లం రెండు వారాల్లోనే ఈ మూవీ రూ. 50 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. దీంతో ఇత‌ర భాష‌ల్లో కూడా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు మూవీ మేక‌ర్స్.

Actress Trisha Movie Identity Updates

ఇప్ప‌టికే త్రిష కృష్ణ‌న్ బ‌హు భాషా న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగు, త‌మిళం, హిందీ చిత్రాల‌లో న‌టించింది. తాజాగా మ‌ల‌యాళంలో కూడా త‌న‌దైన ప‌ర్ ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకుంది. ఐడెంటిటీ చిత్రం ఊహించ‌ని దానికంటే ఎక్కువ‌గా జ‌నాద‌ర‌ణ పొందింది.

గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ గా సినిమాను రూపొందించారు అఖిల్ పాల్, అనాస్ పాల్ . థామ‌స్, త్రిష‌తో పాటు కీల‌క పాత్ర‌ల్లో విన‌య్ రాయ్, మందిరా బేడి, ఇత‌రులు నటించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ మూవీని విడుద‌ల చేశారు. బిగ్ హిట్ గా నిలిచింది.

ప్ర‌స్తుతం ఈ చిత్రాన్ని మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల, శ్రీ వేదక్షర మూవీస్ చింతపల్లి రామారావు సహకారంతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ మూవీ జ‌న‌వ‌రి 24న తెలుగులో విడుద‌ల కానుంది.

Also Read : Madhavi Latha Challenge : జేసీ కామెంట్స్ పై కోర్టులో తేల్చుకుంటా

CinemaTrendingTrisha KrishnanUpdates
Comments (0)
Add Comment