Tripti Dimri: రష్మికను ఆకాశానికి ఎత్తేస్తున్న త్రిప్తి

రష్మికను ఆకాశానికి ఎత్తేస్తున్న త్రిప్తి

Tripti Dimri: అర్జున్ రెడ్డి ఫేం సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌ బీర్‌ కపూర్‌, రష్మిక, బాబి డియోల్, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘యానిమల్‌(Animal)’. డిసెంబరు 1న విడుదలైన ఈ యాక్షన్‌ డ్రామా… అత్యధిక వసూళ్ళు సాధించి ఈ ఏడాది హిట్‌ చిత్రాల లిస్ట్‌లో చేరింది. అంతేకాదు రణ్‌బీర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో రణ్‌ బీర్‌ సరసన రష్మిక అలరించగా… సెకండ్ హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రి(Tripti Dimri) యూత్‌ను ఆకట్టుకున్నారు. అయితే సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ త్రిప్తి డిమ్రి నటనకు అనూహ్యమైన స్పందన వచ్చింది.

ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే సుమారు 30 లక్షల మంది ఇన్ స్టా ఫాలోవర్స్ ను సంపాదించింది. దీనితో అప్పటి వరకూ నేషనల్ క్రష్‌గా ఉన్న రష్మిక స్థానాన్ని త్రిప్తి కైవసం చేసుకుందంటూ నెటిజన్ల నుండి కామెంట్స్‌ కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి… ‘యానిమల్‌’ షూటింగ్ లో రష్మికతో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసింది. ప్రస్తుతం రష్మిక గురించి త్రిప్తి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Tripti Dimri – రష్మిక చాలా ప్రతిభావంతురాలు- త్రిప్తి

ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో నటి త్రిప్తి డిమ్రి మాట్లాడుతూ… రణ్‌ బీర్‌ కపూర్‌, రష్మికతో కలిసి ‘యానిమల్‌’ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఆ సినిమా ఎంతో హుషారుగా ఉంటుంది. రష్మిక చాలా ప్రతిభావంతురాలు. నేను మొదటిరోజు సెట్‌కు వెళ్లగానే పలకరించింది. ఆప్యాయంగా స్వాగతం పలికింది. కొత్త వాతావరణమయ్యే సరికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. దాన్ని గమనించిన రష్మిక నాతో మరింత స్నేహంగా ఉంది. అది అందరిలో ఉండాల్సిన మంచి లక్షణం. ఇక నేను రణ్‌బీర్‌కు పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూశాను. ‘యానిమల్‌’తో నాకల నెరవేరింది. సెట్‌లో రణ్‌బీర్‌ను చూస్తూ విగ్రహంలా ఉండిపోయేదాన్ని. ఆయన చాలా మంచి నటుడు. ‘యానిమల్’కు ఓకే చెప్పడానికి రణ్‌ బీర్‌ కూడా ఓ కారణం’ అని ఆమె తెలిపింది.

Also Read : Hero Danush: ‘కెప్టెన్‌ మిల్లర్‌’ రెండో పాట వచ్చేసింది..!

Rashmika MandannaTripti Dimri
Comments (0)
Add Comment