Tripti Dimri: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్ లో ‘యానిమల్’ బ్యూటీ ?

'పుష్ప 2' ఐటెం సాంగ్ లో 'యానిమల్' బ్యూటీ ?

Tripti Dimri: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా ‘పుష్ప: ది రైజ్‌’. రష్మిక మందన్నా, ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు… దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అప్పట్లో శ్రీ వల్లి, ఊ అంటావా ఊ ఊ అంటావా, నా సామి పాటలు యూ ట్యూబ్ ను షేక్ చేయగా… ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ సినిమాలో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో ‘ఊ అంటావా మావ….’ అనే ఐటెం సాంగ్ లో సమంత హాట్ హాట్ స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగులో ఈ సినిమాను తెరకెక్కించినప్పటికీ తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేయడంతో… ఈ సినిమా పాన్ ఇండియా సూపర్ హిట్ గా నిలిచింది.

దీనితో ‘పుష్ప ది రైజ్‌’కు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ‘పుష్ప: 2 ది రూల్‌’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటరెస్టింగ్ అప్ డేట్… సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ‘పుష్ప: ది రైజ్‌’ లో ‘ఊ అంటావా మావ….’ అనే ఐటెం సాంగ్ లాగానే… దానికి సీక్వెల్ గా రూపొందిస్తున్న ‘పుష్ప: 2 ది రూల్‌’ లో కూడా ఓ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఐటెం సాంగ్ లో సమంతకు బదులుగా ‘యానిమల్’ సినిమాలో ఓవర్ నైట్ హాటెస్ట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి డిమ్రి(Tripti Dimri)తో స్టెప్పులు వేయించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే ఆమెను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనితో త్రిప్తి డిమ్రి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లే అని టాలీవుడ్ వర్గాల చర్చ

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించిన ‘యానిమల్‌’ సినిమాలో చేసిన ఓ పాత్రతో త్రిప్తి డిమ్రి(Tripti Dimri) బాగా పాపులర్‌ అయ్యారు. ఈ సినిమా రిలీజైన కేవలం వారం రోజుల్లో ముప్పై లక్షలకు పైగా ఇన్ స్టా ఫాలోవర్స్ ను సంపాదించి రికార్డు సృష్టించింది. దీనితో ఈ సినిమా తర్వాత త్రిప్తీకి హిందీలో అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు ‘పుష్ప: ది రూల్‌’ పాటకు ఆమెను తీసుకున్నారనే వార్త ప్రచారంలోకి రావడంతో ‘ఊ అన్నావా భామా…!’ అని అభిమానులు సరదాగా అంటున్నారు. మరి.. ప్రచారంలో ఉన్నట్లు ఈ పాటతో త్రిప్తి తెలుగుకి పరిచయం అవుతారా? అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tripti Dimri – ఈ నెల 29న అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే !

‘పుష్ప: ది రూల్‌’ సినిమా నుంచి ఈ నెల 1న ‘పుష్ప..పుష్ప’ అనే లిరికల్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి ‘సూసికి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ సాగే మరో పాట లిరికల్‌ వీడియోను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్‌ వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఈ పాట విడుదల కానుంది.

Also Read : Victory Venkatesh: ఆగస్టు నుండి వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా ప్రారంభం ?

allu arjunPuspha 2Tripti Dimri
Comments (0)
Add Comment