Tripti Dimri: వారంలో 24లక్షల ఫాలోవర్స్ ను పెంచుకున్న ‘యానిమల్‌’ బ్యూటీ

ఒక్క సినిమాతో 24లక్షల ఫాలోవర్స్ ను పెంచుకున్న ‘యానిమల్‌’ బ్యూటీ

Tripti Dimri: అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక హీరోహీరోయిన్లుగా… బాబీ డియోల్, అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘యానిమల్‌’. డిసెంబరు 1న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అదే సమయంలో ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి డిమ్రి ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

త్రిప్తి డిమ్రికి వరుస ఆఫర్లు వరించడంతో పాటు ప్రస్తుతం నేషనల్ క్రష్ త్రిప్తినే అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే ‘యానిమల్‌’ సినిమాకు ముందు… తరువాత… త్రిప్తి డిమ్రి(Tripti Dimri) ఇన్ స్టా ఫాలోవర్స్ చూస్తే అందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ప్రస్తుతం ఇదే విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Tripti Dimri – ‘యానిమల్‌’ రిలీజ్ తరువాత 24 లక్షల ఫాలోవర్స్ ను సంపాదించుకున్న త్రిప్తి

2015లో త్రిప్తి ఇన్‌స్టా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన త్రిప్తి డిమ్రికి… నవంబర్‌ చివరి వారం వరకు 6లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవారు. అయితే ‘యానిమల్‌’ సినిమా విడుదల అయిన తరువాత ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఒక్కసారిగా 30లక్షలకు చేరింది. ఇదీతో మరింత యాక్టివ్ అయిన త్రిప్తి… అప్పటి నుంచి ఇన్ స్టాలో యాక్టివ్‌గా ఉంటూ తన సినిమా విశేషాలతో పాటు రీల్స్‌తో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఏ పోస్ట్‌ చేసినా లక్షల్లో వ్యూస్‌ వస్తున్నాయి.

అయితే త్రిప్తి డిమ్రికి ఇన్ స్టా ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరగడం వెనుక ఆమె ‘యానిమల్‌’లోని ఓ శృంగార సన్నివేశం గురించి బోల్డ్ గా మాట్లాడటమే కారణం అనే టాక్ వినిపిస్తోంది. ఆ సన్నివేశంలో అవసరాన్ని బట్టి నటించడానికి అంగీకరించినట్లు చెప్పిన త్రిప్తి… ఆ సీన్ షూటింగ్ సమయంలో దర్శకుడు సందీప్ వంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని గతంలో చెప్పారు. అయితే ఆ బోల్డ్ సీన్ తో పాటు డైలాగ్ లు నెట్టింట వైరల్ గా మారడంతోనే త్రిప్తికి ఇన్ స్టా ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు అనే టాక్ కూడా వినిపిస్తోంది.

Also Read : Shah Rukh Khan: హాలీవుడ్ అవార్డుల బరిలో ‘జవాన్‌’

animalTripti Dimri
Comments (0)
Add Comment