Tripti Dimri : చిక్కుల్లో పడ్డ యానిమల్ బ్యూటీ ‘త్రిప్తి డిమ్రి’

ఇలాంటివాటికి సంబంధించి డబ్బులు తీసుకోవడం లేదా అడ్వాన్స్ వసూలు చేయడం లేదు.

Tripti Dimri : బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి దిమ్రి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసందే. ఓ ఈవెంట్ కు వస్తానని చెప్పి అడ్వాన్స్ తీసుకుని మోసం చేసిందంటూ పలువురు మహిళా వ్యాపారవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జైపూర్ కు చెందిన కొందరు మహిళ వ్యాపారవేత్తలు కలిసి ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేయగా.. ఆ వేడుకకు త్రిప్తి(Tripti Dimri)ని అతిథిగా ఆహ్వనించారు. ఇందుకు ఆమె రూ.5.5 లక్షలు తీసుకుందని.. ఆమె వస్తుందని అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆమె రాలేదని.. ఈవెంట్ స్టార్ట్ అయ్యే 5 నిమిషాల ముందు వరకు వస్తానని చెప్పి ఆ తర్వాత రాకపోవడంతో నిర్వాహకులు, మహిళల వ్యాపారవేత్తలు మండిపడ్డారు. ఆమె ఫోటోపై నల్లని పెయింట్ రాస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆమె సినిమాలను బ్యాన్ చేస్తామని ఆగ్రహించారు. అయితే తాజాగా ఈ వివాదం పై త్రిప్తి(Tripti Dimri) టీమ్ స్పందించింది.

Tripti Dimri Suffer…

“త్రిప్తి డిమ్రి ప్రస్తుతం తన నెక్ట్ మూవీ విక్కీ విద్య కా వో వాలా వీడియో సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.. షెడ్యూల్ ప్రకారం ఈవెంట్స్, ఇంటర్వ్యూలకు హాజరవుతూ వృత్తిపరమైన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ మినహాయించి వ్యక్తిగతంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనడం లేదు. ఇలాంటివాటికి సంబంధించి డబ్బులు తీసుకోవడం లేదా అడ్వాన్స్ వసూలు చేయడం లేదు . ఈ వేడుక కోసం ఎలాంటి డబ్బులు తీసుకోలేదు” అంటూ స్పష్టతనిచ్చింది టీమ్.

బాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలతో కథానాయికగా అలరిస్తున్న త్రిప్తికి యానిమల్ మూవీ కలిసొచ్చింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణభీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈచిత్రంలో త్రిప్తి కీలకపాత్రలో నటించింది. ఈ మూవీలో ఆమె స్పెషల్ రోల్ అయినా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇందులో జోయా పాత్రలో అందం, అభినయంతో బిగ్ స్క్రీన్ పై మాయ చేసింది. ఈ మూవీ తర్వాత హిందీలో త్రిప్తికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఇటీవలే బ్యాడ్ న్యూజ్ మూవీతో హిట్ అందుకుంది.

Also Read : Thalapathy Vijay : విజయ్ చివరి సినిమాగా ఆ సినిమా రేమేకా..

Indian ActressesTripti DimriUpdatesViral
Comments (0)
Add Comment