Toxic: ‘కేజీఎఫ్’ సిరీస్ విజయాల తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా ‘టాక్సిక్’. ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా షూటింగ్ లాంచనంగా ప్రారంభమైంది.
Toxic Movie Updates
బాక్సాఫీస్ సెన్సేషన్ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్(Toxic): ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ గురువారం బెంగళూరులో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కేజీఎఫ్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత యష్ నటిస్తోన్న కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించేలా డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించనున్నారు. ఈ మూవీ కోసం స్టార్ యాక్టర్స్, టెక్నికల్ టీమ్ చేతులు కలిపింది. గురువారం జరిగిన పూజా కార్యక్రమాల్లో సంప్రదాయానికి అనుగుణంగా నటుడు, నిర్మాత యశ్, నిర్మాత వెంకట్ కె.నారాయణ, వారి కుటుంబ సభ్యులతో కలిసి సినిమా విజయం సాధించాలని కొరుతూ దేవుడి ఎదుట పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై టీమ్‌కి అభినందనలు తెలిపారు.
Also Read : Aye: సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ‘ఆయ్’ !