Touching Touching Song : రాజు మురుగన్ దర్శకత్వం వహించిన జపాన్(Japan) మూవీ శుక్రవారం రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా టచింగ్ టచింగ్ పేరుతో భాస్కరబట్ల రాసిన సాంగ్ ను ఇంద్రావతి పాడింది. ఆమెతో పాటు ప్రధాన పాత్రలో నటించిన కార్తీ నటించాడు. డిఫరెంట్ ఐడియాతో దీనిని రూపొందించాడు దర్శకుడు .
Touching Touching Song Trending
ఈ మూవీలో సునీల్ కూడా జపాన్ లో నటించడం విశేషం. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు దీనిని నిర్మించారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కించినట్లు తెలిపారు దర్శకుడు రాజు మురుగన్.
కార్తీ తను ఇటీవల నటించిన పొన్నియన్ సెల్వన్ మూవీలో నటించాడు. దీనికి మణిరత్నం దర్శకత్వం వహించాడు. ఇది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కార్తీ నటిస్తున్న ఈ చిత్రంపై ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నాడు.
ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం దొరుకుతుందని ఈ మధ్యన ఓ ఛానల్ తో మాట్లాడుతూ చెప్పాడు. ఇటీవలే ఇంద్రావతి చౌహాన్ పాడిన ఊ అంటావా సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ టచింగ్ టచింగ్ సాంగ్ కూడా సెన్సేషన్ అవుతుందని భావిస్తున్నారు.
Also Read : Ritu Varma : మీనన్ మూవీలో మెరిసిన తార