Tollywood Updates : నార్త్ లో దూసుకుపోతున్న ఆ సీనియర్ సౌత్ భామలు

తమన్నా కూడా నార్త్ లో నిదానంగా నిలదొక్కుకుంటున్నారు...

Tollywood : మన దగ్గర సీనియర్‌ హీరోయిన్లకు నార్త్ లో ఇప్పుడు అవకాశాలు తలుపు తడుతున్నాయి. సౌత్‌ గ్రౌండ్‌ని వదులుకోకుండా, నార్త్ గ్రౌండ్‌లో జోరు చూపించడానికి ప్రయత్నిస్తున్న హీరోయిన్లు ఎవరు? అక్కడ వారిని అట్రాక్ట్ చేస్తున్న అవకాశాలేంటి? చూసేద్దాం పదండి… కాజల్‌ తెలుగులో సినిమాలు చేసినన్ని రోజులూ ఆమెను పక్కా లోకల్‌ అనే అనుకున్నారు. అంతగా తెలుగు ఇండస్ట్రీతో కలిసిపోయారు ఈ బ్యూటీ. పెళ్లి చేసుకుని, ఓ బాబు జన్మనిచ్చాక కెరీర్‌ స్పీడు తగ్గిందనే అనుకున్నారు జనాలు. కానీ ఇప్పుడు డబుల్‌ స్పీడ్‌తో ఫ్యాన్స్ ని పలకరించడానికి రెడీ అవుతున్నారు కాజల్‌(Kajal Aggarwal). సౌత్‌లో ఈ భామ చేతిలో ఇండియన్‌3 ఉంది. హిందీలో సల్మాన్‌తో సికిందర్‌కి సిద్ధమవుతోంది. తెలుగులో ఎలాగూ ఎప్పుడూ ఏవో సినిమాలు ఉంటూనే ఉంటాయనుకోండి…

Tollywood Actresses…

తమన్నా కూడా నార్త్ లో నిదానంగా నిలదొక్కుకుంటున్నారు. ఓ వైపు ఓటీటీలు, మరోవైపు మెయిన్‌స్ట్రీమ్‌ సినిమాలతో మిల్కీబ్యూటీ సూపర్బ్ అనిపించుకుంటున్నారు. చేతిలో సినిమాలున్నా లేకున్నా, సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు హల్‌చల్‌ చేయడం, ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండటం… ఈమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటున్నారు క్రిటిక్స్ తెలుగులో ఎప్పుడైనా ఓ సారి తళుక్కుమంటున్నారేగానీ, ఎక్కువగా నార్త్ మీదే ఫోకస్‌ చేస్తున్నారు రాశీఖన్నా. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కూడా ఇప్పుడు ఈమె రూట్లోనే ట్రావెల్‌ చేస్తున్నారు. రీసెంట్‌గా ఇండియన్‌2తో పలకరించింనా ఎక్కువ శాతం నార్త్ ప్రాజెక్టులతోనే బిజీగా ఉన్నారు. మన హీరోయిన్లలో నార్త్ లో ఎప్పటికప్పుడు ప్రూవ్‌ చేసుకుంటున్న మరో నాయిక ప్రియమణి. సౌత్‌లో ఓటీటీ ప్రాజెక్టులతో మెప్పిస్తున్నా, నార్త్ లో మాత్రం ఎప్పుడూ ఏదో ఓ క్రేజీ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు. రీసెంట్‌గా హిందీలో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలే పడ్డాయి ఈ బ్యూటీ కెరీర్‌లో.

Also Read : Siddharth-Aditi : యాపిల్ సీఈఓ ను కలిసి ముచ్చటించిన సిద్ధార్థ్, అదితి లు

heroineTollywoodTrendingUpdatesViral
Comments (0)
Add Comment