Tollywood Actors-Case Sensational :టాలీవుడ్ న‌టుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వు

తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్

Tollywood : బెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హారం తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో(Tollywood) క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ అవినాష్ మ‌హంతి, మాజీ సీనియ‌ర్ కాప్ , టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ యాప్స్ పై సీరియ‌స్ అయ్యారు. ప్ర‌జ‌ల్లో, యువ‌త‌లో చైత‌న్య‌వంతం తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌ధానంగా స‌జ్జ‌నార్ దెబ్బ‌కు పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. ఏకంగా ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు 11 మంది యూట్య‌బూర్స్, ఇన్ ఫ్యూయ‌ర్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. వీరిపై కేసు న‌మోదు చేశారు. విచార‌ణ‌కు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.

Tollywood Actors got Cases

ఇందులో భాగంగా యూట్యూబ‌ర్స్ పంజాగుట్ట పోలీసుల ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఇదే స‌మ‌యంలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ హీరో, హీరోయిన్ల‌కు కూడా కోలుకోలేని రీతిలో పోలీసులు ఝ‌ల‌క్ ఇచ్చారు. మియాపూర్ పోలీసులు కేసు న‌మోదు చేశారు బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్స్ చేశార‌ని. వీరిలో రానా ద‌గ్గుబాటి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మంచు ల‌క్ష్మి, శ్రీ‌ముఖి, ప్ర‌కాశ్ రాజ్ , నిధి అగ‌ర్వాల్ తో పాటు మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 25 మందిపై కేసులు న‌మోదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

బెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హారంలో దాదాపు రూ. 100 కోట్ల‌కు పైగా వ్యాపారం జ‌రిగిన‌ట్లు అంచ‌నా. దీనిపై సీరియ‌స్ గా స్పందించింది తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్. నటీనటుల జీవన విధానం మారడం వల్ల బెట్టింగ్ యాప్స్ లాంటి ప్రచారాల్లో పాల్గొంటున్నారని పేర్కొంది. కొంతమంది తెలియక, మ‌రికొంద‌రు తెలిసీ ప్రమోషన్స్ చేస్తున్నారని మండిప‌డింది. ఆ యాప్స్ వల్ల సమాజానికి చెడు జరుగుతోందంటే ముమ్మాటికీ తప్పే అని స్పష్టం చేసింది.

రెండు రోజుల్లో ‘మా’కు లేఖ రాస్తామని, సంబంధిత యాప్ ప్రమోషన్స్ నిర్వహించే నటులపై చర్యలు తీసుకోవాలని కోరతామని ప్రకటించింది తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్.

Also Read : Hero Chiranjeevi Emotional :డ‌బ్బులు క‌లెక్ష‌న్స్ చిరంజీవి సీరియ‌స్

ActorsPolice CaseTollywoodUpdatesViralYoutubers
Comments (0)
Add Comment