Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ !

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ !

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలు, రాష్ట్రంలో సినీరంగం విస్తరణకు ఉన్న అవకాశాలు, తదితర కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొన్న నిర్మాతలు… అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అప్పుడే తొలి క్యాబినెట్‌ భేటీ ముగిసిన తర్వాత అక్కడికి చేరుకున్న పవన్‌ తో సమావేశమయ్యారు.

Pawan Kalyan Meet

సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్‌కు నివేదించారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ కూడా ఉన్నారు. పవన్‌ ను కలిసిన వారిలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, అశ్వనీదత్‌, డి.సురేశ్‌ బాబు, ఏఎం రత్నం, ఎస్‌.రాధాకృష్ణ, దిల్‌ రాజు, ఎన్వీ ప్రసాద్‌, భోగపల్లి ప్రసాద్‌, డీవీవీ దానయ్య, సుప్రియ, బన్ని వాసు, నాగవంశీ, వంశీకృష్ణ, రవిశంకర్‌, నవీన్‌ యర్నేని తదితరులు ఉన్నారు. పవన కళ్యాణ్‌ హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ ఆ చిత్రంతో నాగార్జున మేన కోడలు సుప్రియ కథానాయికగా పరిచయమైంది. ఎన్నో ఏళ్ల తర్వాత పవన్ ను కలిశారు సుప్రియ. ప్రస్తుతం నిర్మాతగా మారిన ఆమె స్టూడియో సెక్టర్‌ కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ తో సమావేశం అనంతరం నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. “ఈరోజు మా అందరికీ సంతోషకరమైన రోజు. కులాసాగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడుకున్నాం. చంద్రబాబు అపాయింట్మెంట్ కోరాం. ఇద్దరికీ సన్మానం చేయడానికి సమయం అడిగాం. మనస్పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడాం. త్వరలో ఇండస్ట్రీ గురించి రిప్రెజంటేషన్ ఇస్తాం” అని తెలిపారు.

Also Read : Rakul Preet Singh : ఊహించని నష్టంతో ఆస్తులు అమ్ముతున్న రకుల్ భర్త

AM RatnamAswini Duttpawan kalyanTollywood Prodecers
Comments (0)
Add Comment