Vedaraju : టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత వేదరాజు టింబర్(Vedaraju) కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ నటులు, సాంకేతిక నిపుణులు, దర్శక, నిర్మాతలు తీవ్ర సంతాపం తెలిపారు.
Producer Vedaraju No More…
వేదరాజు టింబర్ వయసు 54 ఏళ్లు. ఆయన ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధ పడ్డారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందినా ఫలితం లేక పోయింది. ప్రముఖ నటుడు అల్లరి నరేశ్ తో మడత కాజా, సంఘర్షణ సినిమాలను తెరకెక్కించే ప్రయత్నం చేశారు.
తను కొత్త ప్రాజెక్టుకు ప్లాన్ చేశాడు. కానీ ఇంతలోనే కాలం చేయడంతో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. వేదరాజు టింబర్ కు భార్య, ఓ కూతురు ఉన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు అల్లరి నరేశ్. తను అత్యంత ఆత్మీయుడిని కోల్పోయానని పేర్కొన్నారు. ఇంకొంత కాలం ఉంటాడని తాను అనుకున్నట్లు తెలిపారు.
మడత కాజా మూవీ సందర్బంగా తామిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగిందన్నాడు. చాలా జోవియల్ గా ఉండేవాడని , ఆయన లేక పోవడం తనకు తీరని లోటు అని పేర్కొన్నాడు నటుడు అల్లరి నరేశ్. వేదరాజు టింబర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ హైదరాబాద్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.
Also Read : Beauty Monalisa : కుంభ మేళా మోనాలిసాకు మూవీ ఛాన్స్