Tollywood Heroines : హిట్ కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న ఆ భామలు

రష్మిక మందన్నకు హిట్స్ ఉన్నాయి కానీ ఆడియన్స్‌తో గ్యాప్ వచ్చేస్తుంది...

Tollywood : ఆర్నెళ్ళ కింది వరకు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్నారు శ్రీలీల.. కానీ ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారీమే. రవితేజ సినిమా సైన్ చేసినా షూట్ నెమ్మదిగా సాగుతుంది. ఈ మధ్యే రవితేజకు సర్జరీ కావడంతో.. దానికి తగ్గట్టుగానే షూట్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దాంతో పాటు ఉస్తాద్, రాబిన్ హుడ్‌లలో కూడా నటిస్తున్నారు శ్రీలీల(Sreeleela). సమంత కూడా కమ్ బ్యాక్ కోసం భారీగానే ట్రై చేస్తున్నారు. ఖుషీ యావరేజ్ దగ్గరే ఆగిపోవడంతో తెలుగులో చాలా కాలంగా స్యామ్‌కు సరైన సక్సెస్ లేదు. పైగా ఈ మధ్య ఎక్కువగా వెబ్ సిరీస్‌లు చేస్తున్నారీమె. ఈ మధ్యే సొంత ఇండస్ట్రీ తమిళంలో సినిమా సైన్ చేసినట్లు తెలుస్తుంది. దాంతో పాటు రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ కూడా చేస్తున్నారు సమంత.

Tollywood Heroines..

రష్మిక మందన్నకు హిట్స్ ఉన్నాయి కానీ ఆడియన్స్‌తో గ్యాప్ వచ్చేస్తుంది. ఆ మధ్య యాక్సిడెంట్ కావడంతో కొన్ని రోజులుగా రెస్ట్ మోడ్‌లోనే ఉన్నారు రష్మిక. పుష్ప 2తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు నేషనల్ క్రష్. మరోవైపు కృతి శెట్టి సైతం అంతే. వరస డిజాస్టర్స్ మధ్య.. తన కెరీర్ మార్చే సినిమా కోసం వేచి చూస్తున్నారు బేబమ్మ. విశ్వంభరతో త్రిష సైతం తన మార్క్ చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. మిస్టర్ బచ్చన్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన భాగ్యశ్రీ బోర్సే సైతం ఓ హిట్ కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాతో పాటు.. దుల్కర్ సల్మాన్ కాంతాలోనూ నటిస్తున్నారు భాగ్యశ్రీ బోర్సే. వీటితోనే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు ఈ బ్యూటీ.

Also Read : KTR : సీనియర్ నటి గౌతమి పక్కన కూర్చోడానికి నిరాకరించిన మాజీ మంత్రి

Bhagyashri BorseheroineSamantha Ruth PrabhuTollywoodTrisha KrishnanUpdatesViral
Comments (0)
Add Comment