Tollywood Updates : ఆశలన్నీ 2025 మీదే పెట్టుకుంటున్న ఆ హీరోయిన్లు

పొడవు కాళ్ల సుందరి పూజా హెగ్డేకి 2025లో ఒకటికి మూడు రిలీజులుంటాయి...

Tollywood : పాత రోజులే బావున్నాయని ఆనందపడాలా… ఈ ఏడాది పోతే పోయిందని సర్దిచెప్పుకోవాలా? నెక్స్ట్ ఇయర్‌ వండర్‌ఫుల్‌గా ఉంటుందని ఆశగా ఎదురుచూడాలా… ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్లు… వీటిలో ఏం చేస్తారంటారూ..? ముందు ఆ హీరోయిన్ల పేర్లు చూద్దాం… ఆటోమేటిగ్గా ఆన్సర్‌ వచ్చేస్తుందంటారా.. అయితే చూసేద్దాం పదండి…. లేడీ లక్కు లేడీ లక్కు అంటూ 2023 నిజంగానే తనకు లక్కీ ఇయర్‌ అని చెప్పకనే చెప్పేశారు నటి అనుష్క(Anushka). మన స్వీటీ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయిప్పుడు. ఆల్రెడీ 2024 ఎండింగ్‌కి వచ్చేస్తున్నాం కాబట్టి, ఆ రెండు ప్రాజెక్టులు నెక్స్ట్ ఇయరే రిలీజ్‌ అయ్యేది. పూజా హెగ్డేకి కూడా నెక్స్ట్ ఇయర్‌ మీద మంచి హోప్సే ఉన్నాయి.

Tollywood Updates..

పొడవు కాళ్ల సుందరి పూజా హెగ్డే(Pooja Hegde)కి 2025లో ఒకటికి మూడు రిలీజులుంటాయి. హిందీలో దేవా, తమిళ్‌లో సూర్య 44, దళపతి 69లో హీరోయిన్‌గా నటిస్తున్నారు పూజా హెగ్డే. ఆమెతో పాటు సిల్వర్‌స్క్రీన్స్ మీద నెక్స్ట్ ఇయర్‌ పలకరించే అవకాశం ఉందంటున్నారు సామ్‌. లాస్ట్ ఇయర్‌ ఖుషీతో మెప్పించారు సమంత. గత కొన్నాళ్లుగా సిటాడెల్‌ హనీబన్నీతో వార్తల్లో ఉన్నా, అది థియేటర్లలోకి రాదు. సో,, సామ్‌ సిల్వర్‌స్క్రీన్‌ మీద కనిపించాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్‌ చేయాల్సిందే. ఓన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌లో తెరకెక్కుతున్న సినిమాతోనే జనాలకు హాయ్‌ చెబుతారేమో సామ్‌… ఈమెలాగానే శ్రుతి కూడా నెక్స్ట్ ఇయర్‌ ప్లీజ్‌ అని అంటున్నారు.

లాస్ట్ ఇయర్‌ దుమ్ము రేపిన బ్యూటీ శ్రుతి హాసన్‌. ఈ ఏడాది జస్ట్ అలా గడిపేశారు. నెక్స్ట్ ఇయర్‌ మాత్రం కూలీ, సలార్‌2 అంటూ భారీ లిస్టే ప్రిపేర్‌ చేసుకుంటున్నారు. సేమ్‌ శ్రుతిలాగానే నెక్స్ట్ ఇయర్‌ ప్యాన్‌ ఇండియా ప్రాజెక్టులుంటాయని హింట్‌ ఇస్తున్నారు నయనతార. సో.. ఈ ఏడాది మిస్‌ అయిన సందడిని 2025 తెచ్చేస్తుందన్న హోప్‌ కనిపిస్తోంది సీనియర్‌ బ్యూటీస్‌లో.

Also Read : Vettaiyan OTT : అప్పుడే ఓటీటీలో అలరిస్తున్న సూపర్ స్టార్ ‘వెట్టయాన్’

Anushka ShettyIndian ActressesPooja HegdeSamanthaShruti HaasanTollywoodTrendingUpdatesViral
Comments (0)
Add Comment