Writer Gurucharan : టాలీవుడ్ ప్రముఖ రచయిత ‘గురుచరణ్(75)’ కన్నుమూత

ఎం. ఎ. చదివిన గురుచరణ్ ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు...

Gurucharan : హిట్ పాటల రచయిత గురుచరణ్ (77) ఇక లేరు. ‘ ముద్దబంతి పువ్వులో మూగబాసలు’, ‘కుంతీకుమారి తన కాలుజారి’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిలా’ వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలను రచించిన ప్రముఖ గీత రచయిత గురుచరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారు జామున కన్నుమూశారు.

Gurucharan No More..

గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. గురుచరణ్ అలనాటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడు. ఎం. ఎ. చదివిన గురుచరణ్ ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు. రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. ముఖ్యంగా నటుడు మోహన్‌బాబుకు ఎంతో ఇష్టమైన పాటల రచయిత గురుచరణ్. మోహన్‌బాబు నటించిన చిత్రాలలో గురుచరణ్‌తో ఒక్క పాట అయినా తప్పకుండా రాయించేవారు. మోహన్ బాబు చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్నో మెలోడీ, అర్థవంతమైన పాటలను గురుచరణ్ రచించారు.

Also Read : Demonte Colony 2 OTT : వణుకు పుట్టించే తెలుగు హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో

BreakingUpdatesViral
Comments (0)
Add Comment