Sayaji Shinde : రాజకీయాల్లోకి ఎంటరైన టాలీవుడ్ నటుడు సాయాజీ షిండే

ఆయన చేపట్టిన చాలా సామాజిక కార్యక్రమాల్లో భాగంగా నన్ను కలిశారు...

Sayaji Shinde : ప్రముఖ నటుడు షాయాజీ షిండే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తెలుగుతో పాటు హిందీ, తెలుగు తమిళ చిత్రాల్లో మెరిసిన ఆయన తాజాగా పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన షాయాజీ షిండే శుక్రవారం (అక్టోబర్ 11) అధికారికంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో షాయాజీ షిండే చేరారు. ఎన్‌సీపీ చీఫ్‌, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా మరి కొన్ని నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సతారా జిల్లాలోని తన సొంత నియోజకవర్గం నుంచి షాయాజీ షిండె ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు షిండే(Sayaji Shinde). పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో భాగంగా లక్షలాది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ మాట్లాడుతూ.. ‘ నేను ఎక్కువగా సినిమాలు చూడను కానీ షాయాజీ షిండే గారి సినిమాలు చాలా చూస్తుంటాను. ఆయన చేపట్టిన చాలా సామాజిక కార్యక్రమాల్లో భాగంగా నన్ను కలిశారు. షిండేకు మొక్కలు, చెట్లన్నా చాలా ఇష్టం. ఆయన రాష్ట్రమంతటా మొక్కలు నాటారు. అలాగే సాయిబాబా, సిద్ధివినాయక్‌ బప్పా ప్రసాదంలా మొక్కలు కూడా ప్రసాదంగా ఇవ్వాలని సూచించారు. షాయాజీ ప్రతిపాదనలపై మేం చర్చిస్తున్నాం. ఆయన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేస్తారు’ అని చెప్పుకొచ్చారు.

Sayaji Shinde Join in…

ఇక షాయాజీ షిండే(Sayaji Shinde) సినిమాల విషయానికి వస్తే.. జేడీ చక్రవర్తి నటించిన ‘సూరి’తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్‌’ సినిమాతో బాగా పాపులర్‌ అయ్యారు. ఆ తర్వాత గుడుంబా శంకర్, ఆంధ్రావాలా, పోకిరి, అతడు, ఆంధ్రుడు, రాఖీ, లక్ష్మి, దేవదాసు, చిరుత, దుబాయ్ శీను, నేనింతే, కింగ్, కృష్ణ, ఆర్య 2, కిక్, అరుంధతి, అదుర్స్, ఊసరవెల్లి, బిజినెస్ మ్యాన్, బాద్‌ షా, రేసు గుర్రం, ధ్రువ, వకీల్ సాబ్, ఇస్మార్ట్ శంకర్, గాడ్ ఫాదర్, డబుల్ ఇస్మార్ట్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. తాజాగా షాయాజీ షిండే నటించిన మా నాన్న సూపర్ హీరో సినిమాకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

Also Read : Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ చిత్రం నుంచి దసరా ట్రీట్

Sayaji ShindeUpdatesViral
Comments (0)
Add Comment