Naga Chaitanya : ఈరోజు నాగ చైతన్య, శోభిత ల ఎంగేజ్మెంట్ అంటూ సమాచారం

ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు...

Naga Chaitanya : హీరో నాగచైతన్య , శోభితా ధూళిపాళ్ల కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో వార్తలొచ్చాయి. వీరిద్ధరూ విదేశాల్లో షికారు చేసిన ఫొటోలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి. అయిదే దీనిపై ఇరువురూ ఎవరి వెర్షన్ వాళ్లు మాట్లాడారు. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇరు కుటుంబాలు నేడు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోనున్నట్లు నాగచైతన్య(Naga Chaitanya) సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. దీనిపై అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Naga Chaitanya-Sobhita Dhulipala

ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. శోభితా ధూళిపాళ్ల 1993, మే 31న వేణుగోపాల్‌ రావు, శాంత దంపతులకు జన్మించారు. తెనాలి స్వస్థలం. విశాఖపట్నంలో లిటిల్‌ ఏంజెల్స్‌ స్కూల్‌, విశాఖ వ్యాలీ స్కూల్‌లో చదివింది. ముంబై యూనివర్సిటీ, హెచ్‌.ఆర్‌ కాలేజ్‌లో కామర్స్‌, ఎకనామిక్స్‌ పూర్తి చేసింది. సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచారు. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు. 2013 మిస్‌ ఎర్త్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టారు. 2016లో తొలిసారి నటించారు. అనురాగ్‌ కశ్యప్‌ డైరెక్షన్‌లో ‘రామన్‌ రాఘవ్‌’ చిత్రం చేశారు. ‘ మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. 2018లో తెలుగులో వచ్చిన ‘గూఢాచారి’, 2022లో వచ్చిన ‘మేజర్‌’ సినిమాలతో హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటున్నారు.

Also Read : Hero Ravi Teja : రవితేజ బ్లాక్ బస్టర్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న నేషనల్ క్రష్

marriageNaga ChaitanyaSobhita DhulipalaTrendingUpdatesViral
Comments (0)
Add Comment