Tillu Square Trailer : సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్న ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్

ఇప్పటికే చిత్ర విశేషాలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి

Tillu Square : టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నల గడ్డ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘టిల్లు స్క్వేర్’. గతంలో వచ్చిన “డీజే టిల్లు” మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా తీసిన ‘డీజే టిల్లు’ సినిమా..ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షోతో భారీ హిట్ అయింది. ముఖ్యంగా ఈ చిత్రం యువతకు బాగా నచ్చింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ వస్తుంది.

Tillu Square Trailer Viral

ఇప్పటికే చిత్ర విశేషాలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ‘టిల్లు స్క్వేర్(Tillu Square)’ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రేమికుల రోజున విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందుతోంది. అదే సమయంలో యువతలో హాట్ టాపిక్‌గా మారింది. టిల్లు స్క్వేర్ ట్రైలర్‌లో టిల్లు సినిమాటిక్ యాటిట్యూడ్ యాసతో కూడా ఉంది. మ్యానరిజమ్స్ తో ఆ పాత్రను పోషించిన సిద్ధు జొన్నర గడ్డ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. కథానాయిక అనుపమ కూడా.. ఈ సినిమాలో కాస్త హద్దులు దాటునట్టు హింట్ వచ్చింది టిల్లు స్క్వేర్ ట్రైలర్ తో.

Also Read : Raashii Khanna: ‘యోధ’ టీజర్ డేట్ ను ప్రకటించిన రాశి ఖన్నా !

Anupama ParameswaranCommentsSiddu JonnalagaddaTillu SquareTrendingUpdatesViral
Comments (0)
Add Comment