Tillu Square: తొలి సినిమా ‘డీజే టిల్లు’ తో టాలీవుడ్ లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు విమల్‌కృష్ణ దర్శకత్వం వహించాడు. సిద్ధు జొన్నలగడ్డ సరసన నేహా శెట్టి నటించిన ఈ సినిమా 2022లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సిద్ధు తెలంగాణా యాస, టైమింగ్ పంచ్ లు, రామ్ మిరియాల టైటిల్ సాంగ్ అన్నీ కలిసి ‘డీజే టిల్లు’కు కాసుల వర్షం కురిపించాయి. దీనితో ‘డీజే టిల్లు’ కు సీక్వెల్ గా ‘టిల్లు స్వ్కేర్(Tillu Square)’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సిద్దు జొన్నలగడ్డ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘టికెట్టే కొనకుండా’, సెకండ్ సింగిల్ ‘రాధిక’కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.
Tillu Square – మార్చి 29న వస్తున్న ‘టిల్లు స్క్వేర్’
‘డీజే టిల్లు’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ‘టిల్లు స్క్వేర్’ ఫిబ్రవరి 9న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. అయితే దీనిని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చిత్ర యూనిట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సిద్ధు, అనుపమ కలిసి ఉన్న ఓ రొమాంటిక్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ‘‘డీజే టిల్లు’లా అభిమానుల్నే కాకుండా ప్రేక్షకులందర్ని అలరించేలా ఉంటుంది ‘టిల్లు స్క్వేర్(Tillu Square)’. కచ్చితంగా ఇది మరో మరిచిపోలేని వినోదాత్మక సినిమాగా నిలుస్తుంది’’ అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సినిమాకి డీజే టిల్లు టైటిల్ సాంగ్ పాడిన రామ్ మిరియాల సంగీతం అందిస్తుండగా సాయి ప్రకాశ్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కాస్తా ఎక్స్ పోజింగ్ డోస్ పెంచడంతో తెలంగాణా యాసలో సిద్ధూ జొన్నలగడ్డ టైమింగ్ పంచ్ ల కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Keerthy Suresh: డైహార్ట్ ఫ్యాన్ కు సారీ చెప్పిన మహానటి !