Simbaa: సినీ లవర్స్‌ను అలరించేందుకు ఓ లేటెస్ట్ తెలుగు సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘సింబా(Simbaa)’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ మూవీలో జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించగా సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనను రాబట్టుకుంది.
Simbaa Movie OTT Updates
కథ విషయానికి వస్తే: బయోలాజికల్ మెమరీ కాన్సెప్ట్, పర్యావరణ సందేశంతో ఈ చిత్రం ప్రయోగాత్మకంగా రూపొందింది. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు స్కూల్ టీచర్ (అనసూయ), జర్నలిస్ట్ (శ్రీనాథ్), డాక్టర్ (అనీష్ కురువిళ్ళ). కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరిగా మెుదలు పెట్టి, ముగ్గురూ కలిసి అతి దారుణంగా హత్యలు చేస్తారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో హత్యలు వారి ప్రమేయం లేకుండా జరిగాయని, దానికి కారణం పర్యావరణ ప్రేమికుడు పురుషోత్తం రెడ్డి (జగపతిబాబు) అని తెలుస్తుంది. ఎప్పుడో చనిపోయున వ్యక్తి ఇప్పుడు ఎలా చంపాడు? బయాలాజికల్ మెమరీ ఏంటి? గతం వర్తమానంలోకి ఏలా వచ్చింది? అనేదే స్టోరీ. ఇప్పుడు ఈ సినిమా ఈ రోజు (6, శుక్రవారం) నుంచి ఆహా ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మరో వారం రోజుల్లో అమెజాన్ ప్రైమ్ లోనూ ప్రసారం కానుంది. థియేటర్లో మిస్సయిన వారు, ఓ డిఫరెంట్ చిత్రం కావాలనుకునే వారు ఒకసారి ఈ సినిమాను ఒకసారి చూసేయవచ్చు. జగపతి బాబు, అనసూయలతో పాటు కస్తూరి, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్,వశిష్ట సింహ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించడం విశేషం.
Also Read : Prasanth Varma :ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో బాలయ్య తనయుడి సినిమా ‘సింబా’