Devara: ఆకట్టుకుంటోన్న ఎన్టీఆర్ ‘దేవర’ థర్డ్ సింగిల్ !

ఆకట్టుకుంటోన్న ఎన్టీఆర్ ‘దేవర’ థర్డ్ సింగిల్ !

Devara: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘దేవర’. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్నారు. ‘దేవర(Devara)’గా టైటిల్ పాత్ర‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మొదటి పార్టును సెప్టెంబర్ 27వ తేదీన తెలుగుతోపాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘ఫియర్ సాంగ్..’, ‘చుట్టమల్లె..’ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ ను మేకర్స్ విడుదల చేసారు.

Devara Movie Updates

‘దేవర(Devara)’ చిత్రంలోని మూడో పాట లిరికల్‌ వీడియోని బుధవారం విడుదల చేశారు. ‘కొరమీనా నిన్ను కోసుకుంటా ఇయ్యాల… పొయిమీన మరిగిందె మస్సాలా…’ అంటూ మొదలయ్యే ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రచించగా, అనిరుధ్‌ రవిచందర్‌ స్వరపరిచారు. నకాష్‌ అజీజ్, ఆకాశ ఆలపించారు. రామజోగ‌య్య శాస్త్రి తెలుగులో రాసిన ఈ పాట‌ను త‌మిళంలో విఘ్నేష్ శివ‌న్‌, హిందీలో కౌస‌ర్ మునీర్, క‌న్న‌డ‌లో వ‌ర‌ద‌రాజ్ చిక్‌బ‌ల్లాపుర‌, మ‌ల‌యాళంలో మాన్‌కొంబు గోపాల‌కృష్ణ రాశారు. ‘దావూదీ’ పాట పాడిన వారి విష‌యానికి వ‌స్తే న‌క‌ష్ అజీజ్‌, ఆకాశ తెలుగు, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఆల‌పించారు. న‌క‌ష్ అజీజ్‌, ర‌మ్యా బెహ్రా త‌మిళ‌, మ‌ల‌యాళంలో పాడారు.

బుధవారం విడుదలైన దావూదీ… పాటలో ఎన్టీఆర్‌ డ్యాన్సులు, జాన్వీ కపూర్‌ అందం, ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తారక్‌- జాన్వీ కపూర్‌ల జోడీని చూసి అభిమానులు ముచ్చటపడిపోతున్నారు. ఎన్టీఆర్ డాన్స్ గురించి ఆడియెన్స్‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రోసారి ఈ పాట‌లో తార‌క్ డాన్స్ ఎన‌ర్జిటిక్‌ పెర్ఫామెన్స్‌తో అద‌ర‌గొట్టేశారు. దీంతో ఈ పాట సినిమాపై అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా ఉంది. అనిరుద్ కంపోజ్ చేసిన ట్యూన్ ప్ర‌తీ ఒక్క‌రినీ డాన్స్ చేసేలా చేస్తోంది కానీ.. ఈ పాట వినగానే ‘బీస్ట్’ సినిమాలోని ‘అరబిక్ కుతు- మలమ పిత పితా’ని తలపిస్తుండటం గమనార్హం.

Also Read : Rashmika Mandanna: త్వరలో రష్మిక కొత్త సినిమా ‘తంబా’ ప్రారంభం !

DevaraJanhvi KapoorJr NTRkoratala siva
Comments (0)
Add Comment