Tollywood : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి మిడ్ రేంజ్ హీరోలందరూ పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్లకు మాత్రం సరైన ఆఫర్లు రాకపోవడం విశేషం. శ్రీలీల, కృతి శెట్టి, మృణాల్ ఠాకూర్ మరియు పూజా హెగ్డే వంటి నటీమణులు టాలీవుడ్(Tollywood)లో తమదైన మార్క్ వేసినప్పటికీ స్టార్ హీరోల సరసన సరైన అవకాశాలు మాత్రం పొందలేకపోతున్నారు. ఎప్పుడైతే పాన్-ఇండియా ట్రెండ్ ఊపందుకుందో అప్పుడే టాప్ హీరోయిన్స్‌కి అసలైన సవాల్ ఏర్పడింది. ప్రొడ్యూసర్స్ కూడా వైడ్ రేంజ్‌లో ఆడియెన్స్‌ని ఆకర్షించే కొత్త ముఖాలను వెతుకుతున్నారు.
Tollywood Heroines….
ఉదాహరణకు ఎన్టీఆర్ 31వ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో చేస్తున్నాడు. అయితే అతని ఫిమేల్ లీడ్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. రష్మిక మందన్న మరియు పలువురు బాలీవుడ్ నటీమణుల పేర్లు బయటకు వచ్చినా ఇంకా క్లారిటీ రాలేదు. అదేవిధంగా, నాని రాబోయే ప్రాజెక్ట్‌లలో కూడా టాలీవుడ్(Tollywood) టాప్ భామలని కన్సిడర్ చేయట్లేదట. దసరా దర్శకుడితో చేస్తున్న ఫిల్మ్‌తో పాటు మరొక సినిమాకి కూడా జాన్వీ కపూర్ లాంటి హై బడ్జెట్ హీరోయిన్ కాకుండా తన బడ్జెట్ రేంజ్‌లో సర్చ్ చేస్తున్నారట. అలాగే రాజమౌళి, మహేష్ బాబు గ్లోబల్ సినిమా కోసం సాక్షాతు హాలీవుడ్ నటీమణులను పరిశీలిస్తుండడం విశేషం.
ఇక హను రాఘవాపుడితో ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ ఫౌజి కోసం ఇద్దరు హీరోయిన్లు పరిశీలిస్తున్నారు. కాగా ఇప్పటికే యూట్యూబ్ సెన్సేషన్ ఇమాన్వి ఇస్మాయిల్‌ని సెలెక్ట్ చేయగా రెండో హీరోయిన్ ఛాన్స్ టాలీవుడ్ భామలకు దక్కే అవకాశాలు తక్కువే. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ లోను ఇంకా హీరోయిన్ లాక్ కాలేదు. ప్రస్తుతానికైతే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తమ సినిమాల కోసం భాగ్యశ్రీ భోర్సే లాంటి కొత్త ముఖాల కోసం పరిగెడుతున్నారు. ఇండస్ట్రీలో కొనసాగుతున్న టాప్ హీరోయిన్లపై ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. రెండు ప్లాప్‌ల తర్వాత శ్రీలీల, కృతి శెట్టి వంటి తారలకు కూడా పెద్ద ఆఫర్లు దక్కడం లేదు. దశాబ్దం క్రితం సమంత, కాజల్‌లు టాలీవుడ్‌ని ఏలినంతగా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు లేరని చెప్పొచ్చు.
Also Read : John Amos : హాలీవుడ్ ప్రముఖ నటుడు ‘జాన్ అమోస్’ కన్నుమూత