Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఆరోగ్య క్షీణతకు కారణాలు ఇవే

ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు...

Janhvi Kapoor : బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆమె తండ్రి బోనీ కపూర్‌ తెలిపారు. ‘‘ ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా గురువారం జాన్వీ అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో చేర్పించాం. ఆరోగ్యం మెరుగుపడటంతో శనివారం ఉదయం ఇంటికి తీసుకువచ్చాం’’ అని బోనీ కపూర్‌ బాలీవుడ్‌ మీడియాతో చెప్పారు.

Janhvi Kapoor…

ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. గుల్షన్‌ దేవయ్య, రోషన్‌ మ్యాథ్యూతో కలిసి ఆమె నటించిన చిత్రం ‘ఉలర్‌’ వచ్చే నెలలో విడుదల కానుంది. ‘దేవర’తో తెలుగులోకి ఆమె ఎంట్రీ ఇస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. మరోవైపు బుచ్చిబాబు, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రంలోనూ కథానాయికగా ఆమె సెలెక్ట్‌ అయింది.

Also Read : Hero Ravi Teja : మాస్ మహారాజా ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ డేట్ పై కీలక అప్డేట్

HealthJanhvi KapoorUpdatesViral
Comments (0)
Add Comment