The Village: ఉత్కంఠ రేపుతోన్న ‘ది విలేజ్‌’ ట్రైలర్‌

ఉత్కంఠ రేపుతోన్న ‘ది విలేజ్‌’ ట్రైలర్‌

ఉత్కంఠ రేపుతోన్న ‘ది విలేజ్‌’ ట్రైలర్‌

The Village : ఎప్పుడూ సినిమాలతో బిజీబిజీగా ఉండే హీరోహీరోయిన్లు కోవిడ్-19 తరువాత వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ ప్రేక్షుకులను అలరిస్తున్నారు. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లకు ధీటుగా సౌత్ హీరోహీరోయిన్లులు సైతం పోటీపడి మరీ వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నారు. సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లతో పాటు విజయ్ సేతుపతి, మమ్ముట్టి, నవదీప్ వంటి హీరోలు కూడా వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రముఖ తమిళ హీరో ఆర్య కూడా హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ది విలేజ్‌(The Village)’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

The Village – ‘ది విలేజ్‌’ ట్రైలర్ రిలీజ్

వెబ్ సిరీస్ నిర్మాణ సంస్థ శుక్రవారం విడుద‌ల చేసిన అఫీసియ‌ల్‌ ట్రైల‌ర్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. ద‌య్యాలు, పిశాచాలు దాడులు చేయ‌డం వాటిపై మ‌న‌షులు తిరిగి పోరాటం చేయ‌డం వంటి స‌న్నివేశాలు భ‌యం కల్పించేలా ఉన్నాయి. అడవి సమీపంలో ఉండే ఓ భయానక గ్రామంలో చిక్కుకున్న తన కుటుంబాన్ని హీరో ఆర్య ఎలా కాపాడుకున్నాడు? అన్నది ఈ సిరీస్‌ కథాంశమని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది.

ఆర్య తొలి వెబ్‌సిరీస్‌ ‘ది విలేజ్‌’.

ది విలేజ్‌ అనే గ్రాఫిక్‌ నవల ఆధారంగా మిలింద్ రాజు దర్శకత్వం ‘ది విలేజ్‌’ అనే వెబ్ సిరీస్ ను బి.ఎస్‌. రాధాకృష్ణన్‌ నిర్మించారు. ఆర్య‌ ప్రధాన పాత్రలో పూర్తి హ‌ర్రర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సిరీస్‌లో దివ్య పిళ్లై, ఆడుకాలం నరేన్‌, జార్జ్‌ మయన్‌, పూజా రామచంద్రన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫాం అయిన ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్‌ కానున్న ఈ వెబ్ సిరీస్ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉండనుంది. ఆర్య ప్రస్తుతం తెలుగులో వెంకటేశ్‌ హీరోగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న ‘సైంధవ్‌’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Also Read: Natural Star Nani: ఎన్నికల ప్రచారంలో నాని !

The village
Comments (0)
Add Comment